Pawan Kalyan vs YSRCP : రేయ్ సన్నాసుల్లారా.. దద్దమ్మల్లారా.. అంటూ వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ?
Pawan Kalyan vs YSRCP : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాల విషయంతో పాటు.. రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ఇలా ఒక సినిమా ఈవెంట్ లో ఈవిధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదే మొదటి సారి. తన మనసులోని భావాలన్నింటినీ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ సాక్షిగా బయటపెట్టారు.

pawan kalyan speaks about ysrcp at republic pre release event
ముఖ్యంగా ఏపీ రాజకీయాల గురించి ఆయన మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయితే మీడియా అంత ఆవేశపడింది. దాని మీద కథనాలకు కథనాలు రాసింది.. మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఎందుకు కథనాలు రాయడం లేదు.. జగన్ పై కోడి కత్తి దాడి ఘటనకు సంబంధించి ఎందుకు కథనాలు రాయడం లేదు.. అంటూ పవన్ ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. మరి.. వైసీపీ వచ్చాక ఎందుకు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడటం లేదంటూ పవన్ దుయ్యబట్టారు. రాయలసీమలో ఎందుక బలిజలు నలిగిపోతున్నారు.. దాని మీద కథనాలు రాయండి. బోయ కులస్థులు ఎందుకు రాజకీయంగా ఎదగలేకపోతున్నారో కథనాలు రాయండి. ఒక చిన్నారి చైత్రను అత్యంత దారుణంగా చంపేస్తే.. మీరు సాయి ధరమ్ తేజ్ గురించి కథనాలు రాస్తారా? ఒక ఆడబిడ్డ బయటికి వెళ్తే.. మళ్లీ అంతే సేఫ్ గా ఇంటికి ఎలా తిరిగి రావాలో.. దాని మీద కథనాలు రాయండి అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
Pawan Kalyan vs YSRCP : మీలా మేము వేల కోట్లు సంపాదించలేదు.. కష్టపడి డ్యాన్సులు చేసి, ఫైట్లు చేసి సంపాదించాం
తెలంగాణలో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కానీ.. ఏపీలో థియేటర్లు ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. ఎందుకు.. తెలంగాణలో ఓపెన్ చేసినప్పుడు.. ఆంధ్రాలో ఎందుకు ఓపెన్ చేయరు. వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే.. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేస్తే.. చిత్ర పరిశ్రమను ఆపేస్తే.. వాళ్లంతా భయపడిపోయి తమ కాళ్ల దగ్గరికి వస్తారు.. అని అనుకుంటున్నారు.
చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. రేయ్.. సన్నాసుల్లారా.. దద్దమ్మల్లారా.. హీరో, హీరోయిన్, దర్శకులు కానీ ఎవ్వరైనా ఉదాహరణకు 10 కోట్ల పారితోషకం తీసుకుంటే.. అందులో 45 శాతం ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ పోగా వాళ్లకు వచ్చేది 6.5 కోట్లు. మేము అడ్డగోలుగా సంపాదించడం లేదు.. మీలా వేల కోట్లు సంపాదించలేదు. కష్టపడ్డాం.. డ్యాన్సులు వేస్తాం. ఫైట్లు వేస్తాం.. సినిమా కోసం ఎంతో కష్టపడతాం.. ఎన్నో చేస్తే మాకు డబ్బులు వస్తాయి. మీలా ఊరికే రావు. దందాలు చేస్తే రావు… అంటూ పవన్ కళ్యాణ్ వైసీసీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.