Pawan Kalyan : 175 కీ 175 పోటీకి రెడీయేనా జగన్ సవాల్కి పవన్ కళ్యాణ్ సంచలన కౌంటర్ వీడియో..!!

Authored By Breaking News | The Telugu News | Published on: March 15, 2023, 6:00 pm

Pawan Kalyan : మొన్న గుంటూరు జిల్లా తెనాలిలో రైతుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ అయినా 175 స్థానాలలో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసరటం జరిగింది. అయితే జగన్ సవాల్ పై మచిలీపట్నంలో నిన్న జరిగిన జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మేము ఎలా పోటీ చేయాలో మీరు చెప్పటానికి ఎవరు అని సెటైర్లు వేశారు.

Pawan Kalyan Speech At Janasena 10th Formation Day

Pawan Kalyan Speech At Janasena 10th Formation Day

నా మగతనం గురించి మాట్లాడే వైసీపీ నాయకులకు … అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి..మీ చేత శిస్తు కట్టిస్తాం. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయండి అని చెప్పడానికి మీరెవరు. మా దమ్ము గురించి మాకు బాగా తెలుసు. సారా, గంజాయి సాగు చేసిన డబ్బులు, ఇసుకని, మైన్ లు దోచేసిన డబ్బులు రియల్ ఎస్టేట్ ఇంక అన్నిచోట్ల డబ్బులు దోచేసి….

Pawan Kalyan Speech At Janasena 10th Formation Day

Pawan Kalyan Speech At Janasena 10th Formation Day

ఈ రకంగా మదం ఎక్కిన మాటలు మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు పార్టీని ముందుకు నడిపించటం చాలా కష్టం. అనేక ఇబ్బందులు ఓటమిని చూసాం. కానీ ఈసారి జనసేనకి అందరూ అండగా నిలబడాలని ఓట్లు వేయాలని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తోడలు కొట్టి రెచ్చగొట్టిన వైసీపీ నేతలకు రెండు తొడలు వాచిపోయేలా రాబోయే రోజుల్లో జనసేన ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp