Pawan Kalyan : పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిన పవన్ కల్యాణ్ స్ట్రాటజీ..!
Pawan Kalyan : అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో.. ఆయన స్ట్రాటజీ ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కేవలం వైసీపీని ఢీకొట్టాలని.. వైసీపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న పవన్ కళ్యాన్ రాంగ్ స్టెప్స్ వేస్తున్నారా? అనే అభిప్రాయం ఏపీ ప్రజల్లో కలుగుతోంది. కేవలం జగన్ ను ఓడించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయడం జనసైనికులకు కూడా ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎందుకంటే.. 2014, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి చేదు అనుభవాలు చూశారో అందరికీ తెలుసు. కానీ.. తను ఏం చెప్తే అది ఏపీ ప్రజలు చేస్తారని పవన్ కళ్యాణ్ అనుకోవడమే పప్పులో కాలేయడం. చివరకు సొంత పార్టీ మీద కూడా పవన్ కళ్యాణ్ పట్టు కోల్పోతున్నారా
అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సినిమాల్లో పవర్ స్టార్ ఓకే కానీ.. రియల్ గా కాదు కదా.. ఏపీ ప్రజలు నిజంగా పవన్ ను నమ్మి ఉంటే 2019 ఎన్నికల్లోనే అది తెలిసిపోయేది. కానీ.. చివరకు ఆయనే గెలవలేకపోయారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఒక నమ్మకాన్ని తెచ్చుకుంటున్న పవన్.. తాజాగా వేసిన స్టెప్పు అందరినీ కలవరపెడుతోంది.నిజానికి పవన్ కళ్యాణ్ కు నిలకడలేని తనం ఉందనేది వాస్తవం. చాలా సినిమాల్లోనూ అది కనిపిస్తుంది. ఆయన ఒక చోట కుదురుగా ఉండరు. అలాగే.. ఆయన ఏ రంగంలోనూ నిలకడగా ఉండరు. రాజకీయాలు, సినిమాలు అలాగే. బీజేపీ నేతలు కూడా పవన్ గురించి అదే అనుకున్నారట.
Pawan Kalyan : నిలకడలేని తనమే ఆయనకు మైనస్సా?
ఎందుకంటే బీజేపీతో అప్పట్లో పొత్తు పెట్టుకున్న పవన్.. తాజాగా చంద్రబాబుతో కలిసి తిరుగుతున్నారు. 2014 లోనూ చంద్రబాబుతో కలిసి ఏపీలో ప్రచారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబుతో కటీఫ్ చెప్పారు. 2019 లో ఒంటరిగా పోటీ చేశారు. కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వెంట పడుతున్నారు. నిజానికి.. చంద్రబాబే పవన్ వెంట పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నమ్మేది పవన్ ను మాత్రమే. చంద్రబాబు ఇప్పుడు పవన్ ను ఎందుకు నమ్ముతున్నారో కూడా అందరికీ తెలుసు. ఒకసారి పవన్ దెబ్బతిన్నారు కూడా. అయినా మళ్లీ ఇద్దరూ ఎందుకు కలిసిపోయారో.. ఇద్దరూ కలిసి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.