Heat Waves : జనాలు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.రాష్ట్రంలో అగ్ని నక్షత్రం ఎండలు పరిసమాప్తమైనా మరో మూడు రోజులు ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది వేసవి ప్రభావం పెద్దగా లేదని జనం సంతోష పడుతుండగానే మళ్లీ వడగాలులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంది. పగటి ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఉంది. ఎండ వేడి, ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. బీహార్‌లో ఎండలకు వడదెబ్బతో ఒక్క రెండు గంటల్లోనే 16 మంది మృతి చెందారు. . రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు.రుతుపవనాల రాష్ట్రాన్ని తాకే వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.
రోహిణి కార్తె ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగింది. మరో మూడు రోజుల పాటు ఇదే రకమైన వాతవరణం ఉంటుందని ఐఎండి అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
ఇప్పటికే ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికి రానున్న రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెప్పింది. తెలంగాణలో గురువారం పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా బీమారంలో 47.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్రంలో 46.8డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 46.7డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 46.6డిగ్రీలు, కాగజ్‌నగర్, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.5డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారం, కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారంలో 46.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. వికారాబాద్ జిల్లా బంగంపల్లిలో చంద్రయ్య, సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో జనార్థన్, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో ఎల్లయ్య వడగాల్పులకు మృతి చెందారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.