Heat Waves : విల‌విలలాడుతున్న జనం.. 2 గంటల్లోనే 16 మంది మృతి ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Heat Waves : విల‌విలలాడుతున్న జనం.. 2 గంటల్లోనే 16 మంది మృతి !

Heat Waves : జ‌నాలు ఎండ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.రాష్ట్రంలో అగ్ని నక్షత్రం ఎండలు పరిసమాప్తమైనా మరో మూడు రోజులు ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది వేసవి ప్రభావం పెద్దగా లేదని జనం సంతోష పడుతుండగానే మళ్లీ వడగాలులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంది. పగటి ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఉంది. ఎండ వేడి, ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు.  బీహార్‌లో ఎండలకు వడదెబ్బతో ఒక్క […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 May 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Heat Waves : విల‌విలలాడుతున్న జనం.. ఠారెత్తిస్తున్న ఎండ‌లు ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..!

Heat Waves : జ‌నాలు ఎండ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.రాష్ట్రంలో అగ్ని నక్షత్రం ఎండలు పరిసమాప్తమైనా మరో మూడు రోజులు ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది వేసవి ప్రభావం పెద్దగా లేదని జనం సంతోష పడుతుండగానే మళ్లీ వడగాలులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంది. పగటి ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఉంది. ఎండ వేడి, ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు.  బీహార్‌లో ఎండలకు వడదెబ్బతో ఒక్క రెండు గంటల్లోనే 16 మంది మృతి చెందారు. . రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు.రుతుపవనాల రాష్ట్రాన్ని తాకే వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Heat Waves భ‌య‌పెట్టిస్తున్న వ‌డ‌గాలులు..

రోహిణి కార్తె ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగింది. మరో మూడు రోజుల పాటు ఇదే రకమైన వాతవరణం ఉంటుందని ఐఎండి అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

Heat Waves విల‌విలలాడుతున్న జనం ఠారెత్తిస్తున్న ఎండ‌లు ఎప్ప‌టి వ‌ర‌కు అంటే

Heat Waves : విల‌విలలాడుతున్న జనం.. ఠారెత్తిస్తున్న ఎండ‌లు ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..!

ఇప్పటికే ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికి రానున్న రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెప్పింది. తెలంగాణలో గురువారం పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా బీమారంలో 47.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్రంలో 46.8డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 46.7డిగ్రీలు, ఆసిఫాబాద్‌ జిల్లా కుంచవెల్లిలో 46.6డిగ్రీలు, కాగజ్‌నగర్‌, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.5డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారం, కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారంలో 46.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. వికారాబాద్‌ జిల్లా బంగంపల్లిలో చంద్రయ్య, సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో జనార్థన్, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో ఎల్లయ్య వడగాల్పులకు మృతి చెందారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది