
people flouts social distancing rules in old city hyderabad
Hyderabad : తెలంగాణలో ఈరోజు నుంచి అంటే మే 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఏ ఒక్కరూ ఉదయం 10 దాటితే బయటికి వెళ్లడానికి లేదు. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే తప్ప.. బయటికి వెళ్లకూడదు. లాక్ డౌన్ ను 10 రోజుల పాటు అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపు ఉంటుంది. మిగితా 20 గంటలు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు మాత్రమే.. నిత్యావసర సరుకులు, ఇతర పనులను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 దాటితే షాపులు అన్నీ మూతపడనున్నాయి.
people flouts social distancing rules in old city hyderabad
తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తున్నాం అని ప్రకటించిందో లేదో.. హైదరాబాద్ పాతబస్తీలో ఇదీ పరిస్థితి. గుంపులు గుంపులుగా పాతబస్తీ వాసులు రోడ్ల మీదికి వచ్చారు. మార్కెట్ కి వచ్చి తమకు కావాల్సినవి కొనుక్కొని వెళ్లారు. అయితే.. ఏమాత్రం కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా.. ఏమాత్రం కరోనా భయం లేకుండా పాతబస్తీ వాసులు రోడ్ల మీదికి ఇలా గుంపులు గుంపులుగా రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
people flouts social distancing rules in old city hyderabad
ఓవైపు కరోనా ఇంతలా భయపెడుతుంటే.. రోజురోజుకూ కరోనా విపరీతంగా పెరిగిపోతుంటే.. ప్రజలు మాత్రం కరోనాను చాలా లైట్ తీసుకుంటున్నారు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. చార్మినార్ ప్రాంతంలో పాతబస్తీలో ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదికి గుంపులు గుంపులుగా వచ్చి షాపింగ్ చేశారు. లాక్ డౌన్ ఉంటుంది అనగానే.. ఇలా గుంపులు గుంపులుగా రోడ్ల మీదికి వస్తే.. కరోనా పెరగకుండా ఇంకా తగ్గుతుందా? అని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ఉన్నా.. ఉదయం 6 నుంచి 10 వరకు సడలింపు ఉంటుందని.. ఆసమయంలో కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి కానీ.. ఇలా ఒక్కసారిగా రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరిగితే.. కరోనా ఎలా తగ్గుతుంది.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
people flouts social distancing rules in old city hyderabad
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.