Perni Nani : బూతులు తిట్టడానికే వస్తున్నారా అసెంబ్లీకి?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: March 15, 2023, 10:00 pm

Perni Nani : వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఇటీవలే నాని ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన పేర్ని నాని.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరినీ ఏకిపారేశారు. చంద్రబాబు సేవ కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాడని ఆరోపించారు. చంద్రబాబు మేలు కోసం పవన్ పని చేస్తున్నారు. జనసేన పార్టీ అంటే అభిమానం ఉన్నవాళ్లను చంద్రబాబుకు ఓటేయాలని అడుగుతున్నారు.

perni nani comments on pawan kalyan and chandrababu

perni nani comments on pawan kalyan and chandrababu

ఇదెక్కడి విచిత్రం.. అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.ఇప్పటం సభకు, మచిలీపట్నం సభకు తేడా లేదు. పవన్ సభ పెట్టడం అంటే కాపులను తిట్టడం, సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం, నన్ను తిట్టడం ఇదే పని. వైసీపీలో ఉంటే కాపులు కాపులు కాదా? జనసేనలో ఉన్న వాళ్లే కాపులా? కాపులు ఎక్కడైనా కాపులే. అడ్డగోలుగా తిడుతున్నారు. కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడం కోసమే పవన్ తాపత్రయపడుతున్నారు. పవన్ మారరు.. మారుతారని అనుకోవడం కూడా తప్పు అంటూ పేర్ని నాని మండిపడ్డారు.

perni nani comments on pawan kalyan and chandrababu

perni nani comments on pawan kalyan and chandrababu

Perni Nani : ప్యాకేజ్ స్టార్ అంటే పవన్ కు కోపం వస్తుంది

ప్యాకేజ్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ కు కోపం వస్తుంది. కానీ.. ఆంధ్రజ్యోతి ఆర్కే వెయ్యికోట్ల స్టార్ ప్యాకేజ్ అంటే మాత్రం పవన్ ఆనంద పడతారు.. అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. జనసేన ఆవిర్భావ సభ కాదు.. చంద్రబాబు సభ. ఆయన కోసమే సభ పెట్టినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ అసలు పార్టీ ఎందుకు పెట్టారో? ఇప్పుడు ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. సినిమాలు ఫ్లాప్ అయితే నష్టం వస్తుంది. కానీ.. ఫ్లాప్ అయిన సినిమాకు పవన్ కు లాభాలొచ్చేది మాత్రం ఈ సభలోనే అని పేర్ని నాని.. పవన్ కళ్యాణ్ ను ఏకిపారేశారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  2. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  3. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  4. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  5. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  6. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  7. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp