Perni Nani fires on pawan kalyan and chandrababu
Perni Nani – Pawan Kalyan : అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారు? పార్టీ పెట్టిన వ్యక్తి అన్ని స్థానాల్లో పోటీ చేయాలి కదా. కానీ.. చేయరు. 2014 లో పార్టీ పెట్టారు. పెట్టి కూడా 10 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా గెలిచింది లేదు. ఏదో ఒక్క సీటు గెలిచినా ఆ ఎమ్మెల్యే కూడా ప్లేట్ మార్చారు. ఇలా జనసేన పార్టీని ఎవరి లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ పెట్టారు అనే ప్రశ్నలు చాలామందిలో మెదులుతున్నాయి. వాటికి బలం చేకూర్చుతూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్రి నాని ఓ బాంబు పేల్చారు.
Perni Nani fires on pawan kalyan and chandrababu
అసలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారంటూ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మీటింగ్ పెడతారో? ఎప్పుడు సినిమాల్లోకి వెళ్తారో? ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారో ఎవ్వరికీ తెలియదని.. ఆరు నెలలకు ఒకసారి రోడ్డు మీదికి పవన్ వస్తారని.. ఇక.. రైతులను పరామర్శిస్తున్నా అనే పేరుతో చంద్రబాబు అనుకూల రాజకీయం చేస్తున్నారంటూ పేర్ని నాని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు కూడా జగన్ ను విమర్శించిన ఘనత పవన్ ది అంటూ దుయ్యబట్టారు పేర్ని నాని.
perni nani comments on pawan kalyan and chandrababu
జనం కోసం పట్టుమని 10 రోజులు అయినా పని చేశావా పవన్. కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మరీ మోసం చేశారు. చంద్రబాబు కాపులను మోసం చేశారని అందరికీ తెలుసు. మరి.. నువ్వు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాడారు. దానికి చంద్రబాబు ఆయనపై దాడి చేశారు. అప్పుడు ఎందుకు పవన్ స్పందించలేదు. చంద్రబాబు కాపులను మోసం చేస్తే తాము అక్కున చేర్చుకుంటామని జగన్ ఆనాడే చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయని జగన్ చెప్పారు. ఈ విషయం పవన్ కు తెలియదా? చంద్రబాబును ఎందుకు నిలదీయడు అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
This website uses cookies.