
Police fighting with each other on road
Police : తాగి వీరంగం సృష్టించడం ఈ మధ్య కాలంలో అందరికి కామన్ అయింది. మాములు వ్యక్తులు కొట్టుకుంటే పోలీసులు వారిని దండించో శిక్షించో మంచి చెడులు చెబుతారు. అలాంటిది పోలీసులే తాగి వీరంగం సృష్టిస్తే ఏం చేయాలి. గతంలో ఇలాంటి డిష్యూం డిష్యూంలు చాలానే జరగగా, తాజాగా పీకలదాకా తాగిన పోలీసులు సభ్యసమాజం అసహ్యించుకునేలా చేశారు పట్టపగలే నడిరోడ్డుపై పెట్రోలింగ్ జీప్ ఆపి మరీ ఒకరినొకరు తన్నుకున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. విధి నిర్వహణలో ఉన్న ఆ ఇద్దరూ ఆ సమయంలో తాగిన మైకంలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని జలాన్‌లో గత వారం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిలో కానిస్టేబుల్ ధరమ్‌వీర్‌కి, హోమ్ గార్డు సునీల్ కుమార్‌కి మధ్య ఏదో విషయంలో వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్తా… చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో నడిరోడ్డుపైనే పెట్రోలింగ్ వాహనం నిలిపిన సిబ్బంది అందులోంచి దిగి బయటికొచ్చి ముష్టి యుద్ధం చేయడం ప్రారంభించారు. ” తూ కిత్తారే.. అంటే తూ కిత్తారే ” అని బూతులు తిట్టుకుంటూ తన్నుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఇందులో కానిస్టేబుల్ ధరమ్‌వీర్ అత్యుత్సాహమే కాస్త ఎక్కువున్నట్టు తెలుస్తోంది.
Police fighting with each other on road
జలాన్ జిల్లా రాంపుర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘనటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. వీడియో వైరల్ అవడంతో పోలీసుల ముష్టి యుద్ధం వివాదం కాస్తా జిల్లా ఎస్పీతో పాటు యూపీ పోలీసు బాస్ వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరి ఘటనపై డిపార్ట్ మెంటల్ ఎంక్వరీ కూడా వేయాలని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వీరు కొట్టుకున్న వీడియో నెట్టింట్లో కాస్త వైరల్ గా మారడంతో సామాన్య ప్రజలు సైతం వారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.