TRS తెలంగాణలో అధికార టీఆర్ఎస్ TRS పార్టీ గత ఏడేళ్లుగా ఎంతో మందిని పార్టీలో చేర్చేసుకుంటోంది. పార్టీలోకి వచ్చాక కొద్ది నెలల పాటు వీరిని అందలం ఎక్కించడం.. ఆ తర్వాత క్రమక్రమంగా పక్కన పెట్టేయడం కూడా గులాబీ పార్టీలో కామన్ అయిపోయింది. జూనియర్ల నుంచి తలపండిన రాజకీయ నేతల వరకు ఎంతో మంది ఇప్పుడు తమ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్‌లో కీలక నేతలుగా ఉన్న సీనియర్లు ఇప్పుడు కనీసం తమ గ్రామస్థాయిలో కూడా చక్రం తిప్పలేక చతికిలపడుతున్నారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన వారిలో తుమ్మల, కడియం, పొంగులేటి, జూపల్లి ఉన్నారు. కానీ ఇప్పుడు వారు కనీసం వార్తల్లో కూడా ఉండడం లేదు. అసలు పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ? ఏం చేయాలన్న సమాలోచనల్లో ఉన్నారు.
మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ముందే బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. అయితే అప్పుడు వీరిద్దరి అసంతృప్తిని పసిగట్టిన కేసీఆర్ వీరికి కొన్ని హామీలు ఇచ్చి సైలెంట్ చేశారు. అయితే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌కు పూర్వపు రోజులు వస్తాయని అంటున్నారు. కాంగ్రెస్‌లో పాత జోష్ కనిపిస్తోంది. బీజేపీలోకి వెళ్లాలనుకుంటోన్నవారు, టీఆర్ఎస్ అసంతృప్త వాదులు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. లిస్టులో ఉన్న కారు పార్టీ అసంతృప్త నేతలు కూడా ఇప్పుడు కాచుకుని ఉన్నారట. త్వరలోనే తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయి. వీటిల్లో తమకు ఛాన్స్ వస్తే సరి.. లేకపోతే ఈ ఎమ్మెల్సీల ప్రకటన తర్వాత ఈ నేతలంతా తమదారి తాము చూసుకునేందుకు రెడీగానే ఉన్నారని తెలుస్తోంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.