Post Office: పోస్టాఫీస్ కొత్త స్కీం… జాయిన్ అయితే రెండు లక్షలు.. పూర్తి డీటెయిల్స్..!!
Post Office: ప్రస్తుత రోజుల్లో చాలామంది పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. పెద్ద పెద్ద కుబేరులు ఓవర్ నైట్ లోనే దివాలా తీసేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో కష్టపడి సంపాదించిన దాన్ని సురక్షిత చేసుకునేందుకు నమ్మకమైన పథకాలు పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. పైగా పోస్ట్ ఆఫీస్ పథకాలు చాలా నమ్మకమైనవి కూడా. వీటిలో చేరటం వల్ల ఖచ్చితంగా రాబడి పొందటం మాత్రమే కాదు రిస్క్ అనేది అసలు ఉండదు. అందువల్ల ఖచ్చితమైన స్థిర రాబడి కోసం పోస్టాఫీస్ స్కీమ్స్ లలో డబ్బులు పెట్టుబడి కింద పెట్టొచ్చు.
మనకు తగ్గ నచ్చిన స్కీంలో డబ్బులు దాచుకోవచ్చు. అంతేకాదు పోస్టాఫీస్ అందిస్తున్న పథకాలలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కూడా ఒకటి. దీనిని NSC స్కీం అని కూడా పిలుస్తారు. ఇందులో చేరటం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఇప్పుడు ఇండియా పోస్ట్ ప్రకారం ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే ఈ స్కీము పై ఏడు శాతం వడ్డీ రేటు లభిస్తోంది. అంటే సుమారు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ కల్లా ₹1403 లభిస్తాయి. అంటే వడ్డీ రూపంలో 43 రూపాయిలు లభిస్తున్నాయి. ఈ పోస్ట్ ఆఫీస్ కి మెచ్యూరిటీ కాలం కేవలం 5 ఏళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పై వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ వస్తది. వడ్డీ పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా కూడా కొనసాగిస్తూ ఉంటది.
వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. అంతేకాదు సింగిల్ గా లేదా జాయింట్ గా కూడా ఈ స్కీం లో జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ NSC స్కీమ్ లో జాయిన్ కావాలంటే కనీసం వెయ్యి రూపాయలతో చేరాలి. ఆ తర్వాత ఎంతైనా డబ్బులు దాచుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఈ పథకంపై వచ్చే వడ్డీ మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలోనే చెల్లించడం జరుగుద్ది. మధ్యలో ఇచ్చే ప్రసక్తి ఉండదు. అంతేకాదు ఆదాయపు పన్ను చట్టాల్లో సెక్షన్ 80 సీ కింద ఈ స్కీంలో జాయిన్ అయితే పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ₹1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అందువల్ల రాబడి పన్ను లాభం వంటివి పొందాలనుకునే వారికి ఈ NSC(నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్) అనువుగా ఉంటుంది. ఎటువంటి రిస్కు లేకుండా రాబడి పొందవచ్చు.