Home » News » Prabhas Salaar Movie Update 3
News

Prabhas : ఒరేయ్ ప్రశాంత్ నీల్ మా కొంప ముంచకు — ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చ చిరాకు గా ఉంది !

Authored By
aruna
The Telugu News | Published on: June 23, 2023, 7:00 pm
Advertisement

prabhas : ప్రస్తుతం ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇటీవలే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ కొంచెం హిట్ కొంచెం ప్లాఫ్ టాక్ ను సంపాదించుకున్నాడు. దీని తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్, రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కేజిఎఫ్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేసిన ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సలార్ సినిమాపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ ఉగ్రం ‘తో సలార్ సినిమాను పోలుస్తూ చర్చ సాగడం ఆశ్చర్యపరుస్తుంది.

Advertisement

బ్లాక్ బస్టర్ హిట్ అయిన కన్నడ సినిమా ఉగ్రం కి బెటర్మెంట్ గా సలార్ ని తీస్తున్నాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కనికరం అన్నదే లేని శక్తివంతమైన గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్ ని చూపిస్తున్నాడు. అయితే లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో అతడు భారీ యాక్షన్ తో కట్టి పడేస్తాడని ఊహిస్తున్నారు. ఇది ఉగ్రం పాత్రకు సింబాలిక్ గా ఉంటుంది. ప్రభాస్ కి ఉన్న పాన్ వరల్డ్ ఇమేజ్ కి సరిపోయే విధంగా సంపూర్ణంగా కథ సహా క్యారెక్టరైజేషన్ పరంగా గణనీయమైన మార్పులు చేసారని ఉగ్రం లైన్ నే అసాధారణంగా మార్చారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

prabhas salaar movie update

Advertisement

సలార్ సినిమా కథాంశం సంఘంలో గౌరవం విధేయత అనే రెండు కీలక అంశాలు చుట్టూ తిరగనున్నాయి. సలార్ సినిమాలో ఒకరిని మించి ఒకరు విలన్ గా ప్రదర్శిస్తారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటించింది. అలాగే జగపతిబాబు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై అటు ఇండస్ట్రీలోనూ ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ 28 సెప్టెంబర్ న విడుదల కానుంది. హద్దులు దాటి హృదయాలను దోచుకునే మరో సినిమా కళాఖండాన్ని చూడాలని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఆశించిన గొప్ప సినిమాని ఇస్తాడనే అంతా ఎదురు చూస్తున్నారు. మరీ ప్రభాస్ ఏ సినిమాతో ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటాడో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి