తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజన, దళిత దండోరా సభల పేరుతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత మేర నూతనోత్సాహం తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇదే ఊపును కొనసాగించాలని భావించిన రేవంత్ రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్‌కు ధీటుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలని ప్లాన్ చేశారు.
ఈ కార్యక్రమాలకు తమ పార్టీ జాతీయ నాయకులను.. అందులోనూ రాహుల్ గాంధీని తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నించారు. నిజానికి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న వరంగల్‌లో దళిత, గిరిజన దండోరా సభను ఏర్పాటు చేసి.. ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భావించింది. ఇందుకు సంబంధించి ఆయన సమయాన్ని కూడా కోరింది. ఆ రోజు తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుందని.. వాటికి ధీటుగా కాంగ్రెస్ కూడా భారీ సభను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి భావించారు.
ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపారు. రాహుల్ గాంధీతో సభను ఏర్పాటు చేయించాలని యోచించారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో సెప్టెంబర్ 17న గజ్వేల్‌లో కాంగ్రెస్ సారథ్యంలోని నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వచ్చేలా ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. నిజానికి తెలంగాణలో బీజేపీకి చెక్ చెప్పేలా కాంగ్రెస్ కార్యక్రమాలు ఉండాలని రేవంత్ రెడ్డి భావించారు. తెలంగాణపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేయడంతో.. అంతేస్థాయిలో కాంగ్రెస్ కూడా దూకుడుగా ముందుకు సాగాలని భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రాహుల్ గాంధీ పర్యటించాలని భావించారు.
రాహుల్ వస్తే, జోష్..రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తే.. కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అంచనా వేసింది. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణపై సీరియస్‌గా దృష్టి పెట్టిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని భావించింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో ఏ రకంగా ఆలోచిస్తోందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ సంగతి ఇలా ఉంటే.. సెప్టెంబర్ 17న బీజేపీ నిర్మల్‌లో తలపెట్టిన సభకు ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఆయన సభలో కీలక ప్రకటన చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి భారీ సభ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించనట్టే కనిపిస్తోంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.