Revanth Reddy : రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ? రేవంత్ కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Revanth Reddy : రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ? రేవంత్ కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదా?

తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజన, దళిత దండోరా సభల పేరుతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత మేర నూతనోత్సాహం తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇదే ఊపును కొనసాగించాలని భావించిన రేవంత్ రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్‌కు ధీటుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాలకు తమ పార్టీ జాతీయ నాయకులను.. అందులోనూ రాహుల్ […]

 Authored By sukanya | The Telugu News | Updated on :11 September 2021,1:35 pm

తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజన, దళిత దండోరా సభల పేరుతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత మేర నూతనోత్సాహం తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇదే ఊపును కొనసాగించాలని భావించిన రేవంత్ రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్‌కు ధీటుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలని ప్లాన్ చేశారు.

ఈ కార్యక్రమాలకు తమ పార్టీ జాతీయ నాయకులను.. అందులోనూ రాహుల్ గాంధీని తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నించారు. నిజానికి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న వరంగల్‌లో దళిత, గిరిజన దండోరా సభను ఏర్పాటు చేసి.. ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భావించింది. ఇందుకు సంబంధించి ఆయన సమయాన్ని కూడా కోరింది. ఆ రోజు తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుందని.. వాటికి ధీటుగా కాంగ్రెస్ కూడా భారీ సభను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి భావించారు.

Rahul Gandhi Unhappy on Revanth reddy

Rahul Gandhi Unhappy on Revanth reddy

రాహుల్ ప్లేస్ లో మల్లిఖార్జున..  Revanth Reddy

ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపారు. రాహుల్ గాంధీతో సభను ఏర్పాటు చేయించాలని యోచించారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో సెప్టెంబర్ 17న గజ్వేల్‌లో కాంగ్రెస్ సారథ్యంలోని నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వచ్చేలా ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. నిజానికి తెలంగాణలో బీజేపీకి చెక్ చెప్పేలా కాంగ్రెస్ కార్యక్రమాలు ఉండాలని రేవంత్ రెడ్డి భావించారు. తెలంగాణపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేయడంతో.. అంతేస్థాయిలో కాంగ్రెస్ కూడా దూకుడుగా ముందుకు సాగాలని భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రాహుల్ గాంధీ పర్యటించాలని భావించారు.

malkajgiri congress mp revanth reddy

malkajgiri congress mp revanth reddy

రాహుల్ వస్తే, జోష్..రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తే.. కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అంచనా వేసింది. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణపై సీరియస్‌గా దృష్టి పెట్టిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని భావించింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో ఏ రకంగా ఆలోచిస్తోందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ సంగతి ఇలా ఉంటే.. సెప్టెంబర్ 17న బీజేపీ నిర్మల్‌లో తలపెట్టిన సభకు ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఆయన సభలో కీలక ప్రకటన చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి భారీ సభ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించనట్టే కనిపిస్తోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది