Rahul Sipligunj | సైలెంట్‌గా నిశ్చితార్థం జరుపుకున్న రాహుల్ సిప్లిగంజ్.. ఫొటోలు వైరల్
ప్రధానాంశాలు:
Rahul Sipligunj : సైలెంట్‌గా నిశ్చితార్థం జరుపుకున్న రాహుల్ సిప్లిగంజ్.. ఫొటోలు వైరల్
Rahul Sipligunj | ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాడు. రాహుల్ తన ప్రేయసి హరిణ్య రెడ్డితో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
కొత్త అధ్యాయం మొదలు పెట్టాడు..
సాధారణంగా ప్రతి చిన్న విషయాన్నీ అభిమానులతో పంచుకునే రాహుల్, ఈ ప్రత్యేకమైన జీవిత ఘట్టాన్ని మాత్రం పూర్తిగా సీక్రెట్‌గా ఉంచడం అందరిలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. అయితే, ఓ ఫొటో ఇంటర్నెట్‌లో బయటకు రావడంతో ఇది వెలుగులోకి వచ్చింది.హరిణ్య రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రైవేట్‌లో ఉన్నప్పటికీ, ఆమెకు ఇప్పటికే 15.6 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు, యాంకర్ విష్ణుప్రియ, సింగర్ నోయెల్, అరియానా, గీతా మాధురి, వీజే సన్నీ, స్రవంతి చొక్కారపు, కరుణ భూషణ్, జబర్దస్త్ రోహిణి వంటి అనేకమంది సెలబ్రిటీలు ఆమెను ఫాలో అవుతున్నారు. దీని ప్రకారం ఆమె కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అన్న ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. గత కొంతకాలంగా రాహుల్, హరిణ్యల మధ్య ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ జంట ప్రేమలో ఉన్నట్టు ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చలు సాగుతున్నప్పటికీ, అధికారికంగా ఎవరూ బయటపెట్టలేదు.