
Railway Recruitment : రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నోటిఫికేషన్ విడుదల.. 4,096 అప్రెంటిస్ ఖాళీలు..!
Railway Recruitment : కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైల్వేకి సంబంధించి కొత్త పోస్ట్‌లు రిలీజ్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ రైల్వే పరిధిలోని డివిజన్, వర్క్ షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,096 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలస్తుంది.. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 16 దరఖాస్తులకు చివరితేది కాగా, అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.rrcnr.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు: 4,096 కాగా, వారి విద్యార్హత: టెన్త్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆర్ఆర్‌సీ వర్క్ షాప్‌లు: క్లస్టర్ ఢిల్లీ, క్లస్టర్ ఫిరోజ్‌పూర్, క్లస్టర్ లఖ్‌నవూ, క్లస్టర్ అంబాలా, క్లస్టర్ మొరాదాబాద్ తదిరత వర్క్ షాపుల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ట్రేడ్‌లు: డేటా ఎంట్రీ ఆపరేటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ ,టర్నల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, వెల్డర్, మెషినిస్ట్, ట్రిమ్మర్, క్రేన్ ఆపరేటర్, స్టెనో గ్రాఫర్ తో పాటు తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి. వయో పరిమితి వచ్చే సరికి 16.09.2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
Railway Recruitment : రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నోటిఫికేషన్ విడుదల.. 4,096 అప్రెంటిస్ ఖాళీలు..!
ఎంపిక విధానం: టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.100 .ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రైల్వేలో జాబ్ కావాలని అనుకున్న వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.