Rajinikanth | జిమ్‌లో కుస్తీలు.. రజనీకాంత్ ఫిట్‌నెస్ చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
Rajinikanth | సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఎంత మంది కొత్త హీరోలు వచ్చినా.. స్టార్ హీరోగా రజినీకాంత్ స్థానం మాత్రం ప్రత్యేకమే. 50 ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ, చంద్రబాబు, ఇతర సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు అందుతున్నాయి.
రజనీకాంత్ 74 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్ పట్ల చూపిస్తున్న అంకితభావం అందరికి షాక్ ఇస్తోంది. ఈ ఏజ్ లో ఆయన జిమ్ లో వర్కౌట్లు చేస్తుంటే అందరు నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రజనీకాంత్ జిమ్‌లో శ్రమిస్తూ కనిపించారు.
తన వ్యక్తిగత ట్రైనర్ పర్యవేక్షణలో వర్కౌట్స్ చేస్తున్నారు. బరువులు ఎత్తుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ ఎక్స్ లో షేర్ చేశారు. వీడియోలో నెక్ట్స్ రజనీకాంత్ జిమ్ బెంచ్‌పై కూర్చుని ‘స్క్వాట్స్’ చేస్తూ కనిపించారు. తన శరీరాన్ని మళ్లీ మళ్లీ పైకెత్తుతూ ఈ వ్యాయామాన్ని ఎక్కువసార్లు చేశారు. ఈ తరహా స్క్వాట్స్ కాలు కండరాల బలాన్ని పెంచడానికి, శరీరం ఫిట్ గా, నడకను బ్యాలన్స్ చేయడానికి దోహదపడతాయి.ఈ వీడియో వైరల్‌గా మారింది.
Superstar workout 🏋️♂️❤️🔥pic.twitter.com/arASMUgVO3
— AmuthaBharathi (@CinemaWithAB) August 15, 2025