Ram Charan : 25 లక్షల రూపాయలు గెలుచుకున్న హీరో రామ్ చరణ్

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: July 29, 2021, 9:00 pm

Ram Charan : మీరు మాట్లాడేది టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గురించేనా? అని డౌట్ గా అడగకండి. ఆయన గురించే మేం చెప్పేది. ఆయనే 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. లాటరీ టికెట్ ఏమైనా కొన్నారా? అని కూడా అడగకండి. ఎందుకంటే.. ఆయన ఏ లాటరీ టికెట్ కొనలేదు. ఆయన సినిమాల్లో తీసుకునే పారితోషకం కూడా కాదు అది. ఆయన గేమ్ ఆడి గెలుచుకున్న డబ్బులు అవి. గేమ్ అంటే ఏ గేమ్ అనుకుంటున్నారు.. ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోలో గేమ్ ఆడి 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారట రామ్ చరణ్.

ram charan chief guest in junior ntr evaru meelo koteeswarulu

ram charan chief guest in junior ntr evaru meelo koteeswarulu

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ప్రారంభం కానుంది తెలుసు కదా. త్వరలోనే అది ప్రసారం కానుంది. అయితే.. ఆ షో మొదటి ఎపిసోడ్ మొదటి గెస్ట్ రామ్ చరణ్ అట. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సో.. ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదటి ఎపిసోడ్ ను ఆర్ఆర్ఆర్ స్పెషల్ ఎపిసోడ్ గా తీసుకొస్తున్నారట.

ram charan chief guest in junior ntr evaru meelo koteeswarulu

ram charan chief guest in junior ntr evaru meelo koteeswarulu

Ram Charan : ఇప్పటికే 16 ఎపిసోడ్స్ షూటింగ్స్ పూర్తి చేసుకున్న షో

ఈ షో ఇప్పటికే 16 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్నదట. మొదటి ఎపిసోడ్ లో మెరిసిన రామ్ చరణ్.. కరెక్ట్ సమాధానాలు చెప్పి 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారట. ఇంకో రెండు ప్రశ్నలు చెబితే ఆయన కోటి రూపాయలు గెలుచుకొని ఉండేవారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లేని సమయంలో ముందే.. 16 ఎపిసోడ్స్ ను షూట్ చేశారట. ప్రస్తుతం జూనియర్.. విదేశాల్లో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారట. ఆయన తిరిగి ఇండియాకు రాగానే.. మిగితా ఎపిసోడ్స్ ను షూట్ చేయనున్నారట.

ram charan chief guest in junior ntr evaru meelo koteeswarulu

ram charan chief guest in junior ntr evaru meelo koteeswarulu

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp