Ram Charan : ఏంటి.. చరణ్-జాన్వీతో జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్2 నా.. బాక్సాఫీస్ బద్దలే..!
Ram Charan : అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో తన సత్తా చాటి ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ముందుగా ఎన్టీఆర్‌తో కలిసి దేవర అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత రామ్ చరణ్ మూవీకి కూడా సైన్ చేసింది. ప్రస్తుతం దేవరలో నటిస్తున్న జాన్వీ త్వరలో చరణ్‌తో కలిసి బుచ్చిబాబు సన దర్శకత్వంలో క్రేజీ పాత్ర చేయనుందట. అయితే అప్పట్లో చిరంజీవి- శ్రీదేవి కలిసి జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం చేయగా, అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వారి పిల్లలు రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి చేయనున్న చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. మరోవైపు చరణ్, జాన్వీ కలిసి జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్2 చేస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలు అయిపోతాయని అంటున్నారు. అయితే దీనిపై తాజాగా చిరు స్పందించారు.
సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పాల్గొన్న చిరంజీవిన బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మాస్ కమర్షియల్ చిత్రాలలో అభిమానులు నన్ను చూడడానికి ఎంతో ఇష్టపడతారు. రుద్రవీణ మూవీ వలన నాకు మంచి పేరొచ్చింది. కానీ నిర్మాతగా ఉన్న నా తమ్ముడు నాగబాబు మాత్రం చాలా నష్టపోయాడు అని చిరంజీవి చెప్పారు. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకసారి నాకు దంగల్ వంటి చిత్రాలు చేయవచ్చుగా అని సలహా ఇచ్చారు. అప్పుడు నేను నిర్మాతలు నష్టపోతారని చెప్పాను. మాస్ కమర్షియల్ చిత్రాలు మాత్రమే నా నుండి కోరుకుంటున్నారు. డాన్సులు, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయని చిరు స్పష్టం చేశారు.
Ram Charan : ఏంటి.. చరణ్-జాన్వీతో జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్2 నా.. బాక్సాఫీస్ బద్దలే..!
ఇక జాన్వీ కపూర్-చరణ్ జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 చేస్తే చూడాలని ఉందనే కోరిక కూడా బయటపెట్టాడు చిరంజీవి.ఇటీవల జాన్వీని చూసిన వెంటనే శ్రీదేవి గుర్తుకు వచ్చింది. భావోద్వేగానికి గురయ్యాను. శ్రీదేవి లాంటి మంచి నటిని సినిమా పరిశ్రమ కోల్పోవడం విషాదకరం. అయితే రామ్ చరణ్- జాన్వీ కపూర్ జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 చేస్తే చూడాలని ఉంది. అది నా కోరిక… అంటూ చిరంజీవి మనసులోని మాటని బయటపెట్టారు.
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
This website uses cookies.