Ramgopal varma : ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్.. మరి ప్రధాని ఎవరంటే..? వీడియో షేర్ చేసిన ఆర్జీవీ

Authored By mallesh | The Telugu News | Published on: March 4, 2022, 9:00 pm

Ramgopal varma : రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు చెబితే చాలా మందికి ఆయన చేసిన సంచలనాలే గుర్తుకొస్తాయి. ఆయనది ఒక డిఫరెంట్ మైండ్ సెట్. ఒక అంశాన్ని ప్రపంచం మొత్తం ఒక కోణంలో చూస్తే ఆయన మరో కోణంలో చూస్తారు. ఇండస్ట్రీలో ఈయన సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఈయన ఏ మూవీ తీసినా అది ఒక సంచలనమే. ఈయనతో మూవీ చేసేందుకు ప్రోడ్యూసర్స్ సైతం వెనకాడరు. ఎందుకంటే ఆర్జీవీతో మూవీ చేస్తే అది మినిమం గ్యారంటీ అనే ముద్ర ఉంది.

ఎందుకంటే ఆర్జీవీ డైరెక్షన్ చేసే మూవీస్ కు పెద్దగా ప్రమోషన్స్ తో పడి ఉండదు. ఎందుకంటే ఆయన మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి విడుదల చేసే టైం వరకు ఎదో ఒక వివాదాల్లో చిక్కుకుంటుంది. దీని వల్ల ఆటోమెటిక్ గా పబ్లిసిటీ అవుతుంది.ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు ఆర్జీవీ. సోషల్ మీడియాలో ఆయన చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సెటబ్రెటీలను, రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఆయన పోస్టులు పెడుతుంటారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై సెటైర్స్ వేశారు. తాను ప్రధాని అవుతానని కేఏ పాల్ మాట్లాడిన వీడియోను షేర్ చేశాడు ఆర్జీవీ.

rgv shared ka paul video

rgv shared ka paul video

Ramgopal varma : వీడియో షేర్..

దానికి పవన్ కళ్యాణ్ ను సైతం ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ప్రజాశాంతి పార్టీలో చేరండి. మొత్తంగా 42 ఎంపీ స్థానాలు గెలిచి నేను ప్రధాని అవుతాను. ఏపీకి పవన్ సీఎం అవుతారు. ఏపీ అభివృద్ధికి పవన్ సిద్ధం కావాలి అంటూ కేఏ పాల్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే మరి రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp