Home » Entertainment » Rashmi Gautham Peformanace In Peaks
Entertainment

Rashmi Gautham : నీతో సాయంత్రం అంటూ ర‌ష్మీ గౌత‌మ్‌ను లైన్‌లో పెడుతున్న హైప‌ర్ ఆది..!

Authored By
Sam C
The Telugu News | Updated on: April 28, 2022 5:23 pm
Advertisement

Rashmi Gautham: ప్ర‌స్తుతం బుల్లితెర సూప‌ర్ యాంక‌ర్స్‌లో ర‌ష్మీగౌత‌మ్ ఒక‌రు. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ర్షించే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌రణ పొందిన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మీ. ఈ అమ్మడు ఇటీవ‌ల సుదీర్‌తో కాకుంగా ప‌లు షోలు చేస్తుంది. రీసెంట్‌గా ర‌ష్మీ నా అట సూడు స్పెష‌ల్ ఈవెంట్‌కి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఇందులో హైప‌ర్ ఆది, ఆటో రామ్ ప్ర‌సాద్‌తో క‌లిసి చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. హైప‌ర్ ఆది వ‌రుస పంచ్‌లు కురిపిస్తుండ‌గా, దానికి త‌న‌దైన శైలిలో పంచ్‌లు విసురుతుంది ర‌ష్మీ గౌత‌మ్. ఈ ప్రోమో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.. అమ్మడు పబ్లిక్ లో కనిపిస్తే జంక్షన్ జామ్ కావలసిందే. ఓ టీవీ యాంకర్ కి ఈ రేంజ్ క్రేజ్ అంటే సాధారణ విషయం కాదు.

Advertisement

rashmi-gautham-peformanace-in-peaks

ర‌ష్మీ ర‌చ్చ‌..

రష్మీ పబ్లిక్ లోకి వస్తే చాలు, చూడడానికి జనాలు ఎగబడిపోతారు. ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు చేస్తారు. ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడు ఆమెకు తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది. రష్మీ క్రేజ్ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తుందని అందరూ భావించారు. అయితే బుల్లితెర కలిసొచ్చినంతగా ఆమెకు వెండితెర కలిసి రావడం లేదు. హీరోయిన్ గా పలు ఆఫర్స్ దక్కినా, హిట్ అనేది దక్కలేదు. దీనితో ఆమెకు చిన్నగా అక్కడ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక భోళా శంక‌ర్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని చెప్పుకొచ్చారు.

Advertisement

ప్రస్తుతం రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ అద‌ర‌గొట్ట‌నుంది. రష్మీని ఢీ సీజన్ 14 నుండి తొలగించారు. అలాగే సుడిగాలి సుధీర్, జడ్జి పూర్ణ, దీపికా పిల్లిని సైతం తొలగించడం జరిగింది. వీళ్ల సారథ్యంలో షో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. మరి ఢీ నిర్వాహకులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. వీరి నిష్క్రమణతో రేటింగ్ కూడా బాగా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి .చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మూవీలో రష్మీ నటిస్తున్నారు. ఈ బోల్డ్ యాంకర్ బోల్డ్ ఫోజులకు జనాల మైండ్ బ్లాక్ అవుతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి