
Rashtrapathi Vs Rashtra 'Patni', The Ugly Fight.!
Droupadi Murmu : అసలు చట్టసభలు ఎందుకున్నాయ్.? ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదు, ప్రజలకు అవసరమైన చట్టాలు చేయడానికీ కాదు.! ఔను, పాలక, ప్రతిపక్షాలు తిట్టుకోవడం కోసం మాత్రమే చట్ట సభలున్నట్టుంది పరిస్థితి. లేకపోతే, పార్లమెంటు వేదికగా, ‘రాష్ట్రపతి – రాష్ట్రపత్ని’ అంశంపై రగడ చోటు చేసుకోవడమేంటి.? కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి ప్రస్తావిస్తూ, ‘రాష్ట్రపత్ని’ అన్నారు. జరిగిన పొరపాటుపై ఆయన చింతించారు కూడా. ఉద్దేశ్యపూర్వకంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని అధిర్ రంజన్ చౌదరి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే వాదన వినిపిస్తోంది.
నిజానికి, అధిర్ రంజన్ చౌదరి ఒకే ఒక్కసారి ఆ మాట అన్నారు. కానీ, దాన్ని పదే పదే రిపీట్ చేస్తూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని భారతీయ జనతా పార్టీనే అవమానిస్తూ వస్తోంది. చట్ట సభల్లో పదే పదే అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ.. అసలంటూ చట్ట సభల కార్యకలాపాల్ని జరగనీయకుండా బీజేపీ సభ్యులు చేస్తూ వచ్చారు. చిత్రమేంటంటే, చట్ట సభల్లో రాజకీయాల విషయమై ఒకింత బాధ్యతాయుతంగా వ్యవహరించే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ విషయమై సంయమనం కోల్పోతున్నారు. స్మృతి ఇరానీ సహా, బీజేపీ మహిళా నేతలంతా పెద్దయెత్తున రాద్ధాంతం చేస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
Rashtrapathi Vs Rashtra ‘Patni’, The Ugly Fight.!
తన వ్యాఖ్యలో దొర్లిన పొరపాటు పట్ల చింతిస్తున్నాననీ, ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేందుకూ సిద్ధంగా వున్నానని అధిర్ రంజన్ చౌదరి చెబుతున్నా, ఇంత రాద్ధాంతం బీజేపీ ఎందుకు చేస్తోందన్నది ఎవరికీ అర్థం కావడంలేదు. ఇటీవలే ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. ఇటీవలే ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇంతలోనే, ఆమెని ఇంతలా అవమానించాలా.? ఇంతకీ, ఇక్కడ అవమానిస్తున్నదెవరు.? కాగా, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా, అధిర్ రంజన్ చౌదరి ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదనీ, అయినాగానీ క్షమాపణ చెప్పేందుకు ఆయన సిద్ధంగా వున్నారని చెప్పడం గమనార్హం. అయితే, బీజేపీ మాత్రం, ఈ వివాదం విషయంలో తగ్గేదే లే అంటోంది. అసలు బీజేపీ ఈ వివాదం నుంచి ఏం ఆశిస్తోందో ఏమో.!
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
This website uses cookies.