
#image_title
Rathika Rose : బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ దక్కించుకున్న వారిలో రతికా రోజ్ ఒకరు. ఈ అమ్మడికి అదృష్టం చాలా ఎక్కువ. అందుకే ఒకసారి ఎలిమినేట్ అయిన తిరిగి మళ్లీ హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది.బిగ్ బాస్ షోలో లవ్ ట్రాక్ నడిపి విపరీతమైన నెగిటివీటిని సొంతం చేసుకుంది. తాను చేసే పనులతో పలువురిని ఇబ్బంది పెడుతూ… త్వరలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి అదిరిపోయే అవకాశాలు అందిపుచ్చుకుంటూ సందడి చేస్తుంది. ఇటీవలే రెండు పెద్ద సినిమాల్లో ఛాన్సులు కొట్టేశానని చెప్పిన ఈ బ్యూటీ తాజాగా ఓ స్టార్ హీరోతో స్క్రీన్ పంచుకోబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చింది.
బీడీ తాగడమేంది..
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో తనకి ఛాన్స్ వచ్చిందని పేర్కొంది. ఈయన ఒక్కరే కాకుండా హీరో విజయ్ సేతుపతితో కూడా తాను ఓ సినిమా చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక బుల్లితెరపై సందడి చేస్తుంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రతిక రోజ్ షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆమె పొలాల్లో దమ్ము కొడుతూ మాస్ అవతార్ లో దర్శనం ఇచ్చింది. లంగా ఓణీ కట్టి. పొలాల్లో సైకిల్ పై వెళుతూ… బీడీ తాగింది. ఇదంతా ఓ రీల్ కోసం చేసింది అమ్మడు. అల్లు అర్జున్-రష్మిక మందాన జంటగా నటించిన పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్ ‘సూసేకి’ ఇటీవల విడుదలైంది. సదరు సాంగ్ రీల్ లో నటించిన రతిక రోజ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అది కాస్తా వైరల్ గా మారింది. ఫ్యాన్స్ అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
కాగా, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో అడుగు పెట్టిన ఈమె రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో మొదట్లో స్నేహంగా, ప్రేమగా ఉన్నట్లు కనిపించి ఆ తర్వాత అతడిపైనే నెగిటివ్ అయింది. దీంతో ఆమెకు విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అలా నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ బయటకు వచ్చాకా తనపై ఉన్న నెగిటివిటీని చూస్కుని బయటపడిన ఆమె మరోసారి హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. పద్ధతి మార్చుకొని శివాజీ, ప్రశాంత్, యావర్ లతో స్నేహంగా ఉంటూ తనపై వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.
Mana Shankara Vara Prasad Garu Records : టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ స్టార్స్ ఆరుగురు ఉండగా, సీనియర్ హీరోలుగా…
Fruit Juice : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజువారీ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే కొందరు పండ్లు…
Sankranti Festival : సంక్రాంతి పండుగను సాధారణంగా పంటల పండుగగా మాత్రమే చూసినా, భక్తుల దృష్టిలో ఇది ఆధ్యాత్మికంగా ఎంతో…
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
This website uses cookies.