Ravi Basrur : అరెరె ఎంత పనైపోయింది… ‘సలార్’పై అధికారిక లీక్!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 12 February 2021, 7:31 pm

Ravi Basrur : ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా అని రూమర్లు వచ్చిన సమయంలో కథ ఏంటి నేపథ్యం ఏంటి అన్న విషయాలు కూడా బయటకు వచ్చాయి. ప్రశాంత్ నీల్ కన్నడలో తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు రీమేక్‌గానే సలార్ సినిమా ఉండబోతోందని లీకులు వచ్చాయి. కన్నడ ఇండస్ట్రీలో ఉగ్రం సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఆ కథను ప్రభాస్ రేంజ్‌కు మార్పులు చేర్పులు చేసి రీమేక్, సీక్వెల్‌గా చేస్తున్నాడని టాక్ వచ్చింది.

Ravi Basrur about Prabhas Salaar

Ravi Basrur about Prabhas Salaar

సలార్’పై అధికారిక లీక్!

అయితే ఈ విషయంపై ఎవ్వరూ కూడా అధికారికంగా స్పందించలేదు. అయితే తాజాగా సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ టంగ్ స్లిప్ అయ్యాడు. ఈ మూవీ గురించి కన్నడ మీడియాలో మాట్లాడుతూ.. అసలు విషయం చెప్పేశాడు. ‘ఉగ్రం’కు రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందేగా అంటూ సింపుల్‌గా నోరు జారేశాడు. దీంతో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఉగ్రం సినిమా గురించి వెదుకులాట ప్రారంభించారు.

పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ కథ, ఎమోషన్స్ నిండుగా ఈ కథను ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాడట. మొత్తానికి సలార్‌కు ఇచ్చిన డేట్లు, దాని బడ్జెట్ కూడా చాలా తక్కువే అని తెలుస్తోంది. ఇలా అన్నీ తక్కువే అయినా కూడా ఇంపాక్ట్ మాత్రం ఓ రేంజ్‌లోఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్యే మొదటి షెడ్యూల్ సింగరేణి గనుల్లో ముగిసింది. అయితే తదుపరి షెడ్యూల్ గురించి త్వరలోనే ప్రకటన రానుంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp