Jubilee Hills Scam : జూబ్లీ హిల్స్ స్కామ్.. అసలు నిజాలు ఇవే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jubilee Hills Scam : జూబ్లీ హిల్స్ స్కామ్.. అసలు నిజాలు ఇవే?

Jubilee Hills Scam : ఎవరైనా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అతడిని తొక్కేసేందుకు బడాబాబులు సిద్ధంగా ఉంటారు. అది నేటి సమాజం తీరు. ఒకరు మంచి పని చేయడం, సమాజం కోసం పనిచేయడం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడం చూసి ఓర్వలేరు. ప్రజల్లో ఆదరణ ఉన్నా భరించలేరు. వాళ్లను చూసి తీవ్రంగా అసూయ, ద్వేషాలను పెంచుకుంటారు కొందరు. అయితే.. సమాజ శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడిన ఆ వ్యక్తి గురించి… ఆయనకు ఎదురైన సవాళ్లు, కష్టాల గురించి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 May 2021,7:08 pm

Jubilee Hills Scam : ఎవరైనా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అతడిని తొక్కేసేందుకు బడాబాబులు సిద్ధంగా ఉంటారు. అది నేటి సమాజం తీరు. ఒకరు మంచి పని చేయడం, సమాజం కోసం పనిచేయడం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడం చూసి ఓర్వలేరు. ప్రజల్లో ఆదరణ ఉన్నా భరించలేరు. వాళ్లను చూసి తీవ్రంగా అసూయ, ద్వేషాలను పెంచుకుంటారు కొందరు. అయితే.. సమాజ శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడిన ఆ వ్యక్తి గురించి… ఆయనకు ఎదురైన సవాళ్లు, కష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

real truth behind jubilee hills scam

real truth behind jubilee hills scam

ఆయన ఎవరో కాదు.. NTV founder Tummala Narendra Chowdary. తుమ్మల నరేంద్ర చౌదరి…  మీడియా రంగంలో ఎనలేని సేవలందించిన విషయం మనకు తెలిసిందే. జర్నలిజానికి నిలువెత్తు రూపంగా ఆయనని అభివర్ణిస్తారు పాత్రికేయులు. అలాంటి అయనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. అయన ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసులు దౌర్జన్యంగా బనాయించి అయన ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

ఎక్కువగా జూబ్లీ హిల్స్ స్కామ్ లో చౌదరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆ స్కామ్ లో చౌదరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణాలు అనేకం. ఒకటి జూబ్లీ హిల్స్ cooperative society ప్యానెల్ నరేంద్ర చౌదరి అధ్యక్షతన ఉండటం. కానీ… ఇటీవల ఆ ప్యానెల్ ను TV5 గెలుచుకుంది. ఈసారి పోటీలో Tummala Narendra Chowdary పాల్గొనలేదు. అయన బలపరిచిన ప్యానెల్ మాత్రం ఓడిపోయింది. అయితే అసలు సంగతి ఇక్కడే మొదలైంది..  గత నెల చివరి వరకు ఈ స్కామ్ కు సంబంధించి.. ఎటువంటి మూలాలు లేవు కానీ హఠాత్తుగా తెర మీదకు రావడం వెనుక  నరేంద్ర చౌదరి మీద కొంత మంది పని గట్టుకుని బురద చల్లే ప్రయత్నం లో భాగంగా జరిగిన కుట్రకు పునాది తెలుస్తుంది.

Jubilee hills cooperative house building society కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయిన tv5 Managing Director Ravindranath Bollimeni.. Narendra Chowdary పైన, గత ప్యానెల్ సెక్రెటరీ అయిన T hanumantha Rao పైన భూ కబ్జా కింద కేసు పెట్టారు. అది కూడా  జూబిలీ హిల్స్ cooperative society ఎన్నికల్లో  tv5 Managing Director Ravindranath Bollimeni ప్యానెల్ గెలిచిన తర్వాత కేసు పెట్టారు. అంతకుముందు ఈ కేసు ఎక్కడికిపోయింది అని ప్రశ్నిస్తున్నారు సామాన్య జనాలు. గతంలో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఈ లావాదేవీని ఇప్పుడు స్కామ్ పేరుతో బయటకు తీసుకురావడం వెనుక అసలు కోణం ఆయనపై కావాలని బురద చల్లడమే అని స్పష్టంగా అర్థం అవుతోంది.

జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి గత అధ్యక్షుడిగా ఉన్న నరేంద్ర చౌదరి… సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవలు అందించారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీడియా రంగంలో ఎన్టీవీతో పాటు… మొట్టమొదటి తెలుగు భక్తి చానెల్ అయిన భక్తి టీవీ, అలాగే మహిళా సాధికారత కోసం వనిత టీవీని స్థాపించి నరేంద్ర చౌదరి ఎందరికో మార్గదర్శకులు అయ్యారు. ఆయన చానెళ్ల విషయంలో ఆయన్ను కుంగదీసే ప్రయత్నమూ జరిగింది. ఆధ్యాతికతను ప్రేక్షకులను పంచుతున్న భక్తి ఛానల్ ను రానివ్వకుండా, పాపులర్ కానివ్వకుండా కొంతమంది మీడియా బడా బాబులు చూస్తున్నారు. ఆ చానల్ గురించి బ్యాడ్  గా కొన్ని వెబ్ సైట్ లు,  యూట్యూబ్ చానెల్స్ ద్వారా రాయిస్తూ… చెప్పిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.

కోటిదీపోత్సవం వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలకు పునాది వేసిన ఓ సంఘసంస్కర్తపై ఎంతమంది ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలని చూసినా దాన్ని ఎదుర్కొని నిలబడతారు తప్ప ఆయన కుంగిపోరు.. అని నరేంద్ర చౌదరిని అభిమానించే వాళ్లు చెబుతున్నారు. ఆయన్ను దిగజార్చడానికి చాలా ప్రముఖ మీడియా సంస్థలు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయి అని సమాచారం. కానీ… వాటన్నింటికీ.. సరైన సమాధానాన్ని నరేంద్ర చౌదరి చెబుతారు.. ఆ రోజు కూడా దగ్గర్లోనే ఉంది.

Also read

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది