Realme 9 Pro Series: రియల్‌మీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రియల్‌మీ 9 సిరీస్ ఫోన్స్ వచ్చేశాయి. రియల్‌మీ 9 ప్రో 5జీ, రియల్‌మీ 9 ప్రో+ 5జీ మొబైళ్లు భారత్‌లో విడుదలయ్యాయి. అద్భుతమైన ఆప్షన్స్‌తో తక్కువ ధరలో ఈ ఫోన్స్ ఉన్నాయి. నేరుగా సూర్యుడి కాంతి పడినప్పుడు లైట్ బ్లూ కలర్‌లో ఉండే బ్యాక్ పానెల్ ఎరుపు రంగులోకి మారిపోతుంది. అయితే ఈ కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ బ్లూకలర్ ఆప్షన్‌కే ఉంటుంది. రియల్ మీ 9 ప్రో 5 జీ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999గా ఉంది. సన్‌రైజ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్ లభ్యం కానుంది.రియల్‌మీ 9ప్రో+ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ ధర రూ.24,999గా ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999, 8జీబీ ర్యామ్ + 1256జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.28,999గా రియల్ మీ నిర్ణయించింది.
ఈ మొబైల్ కూడా సన్‌రైజ్ బ్లూ, ఆరా గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌లలో అందుబాటులోకి వస్తుంది. ఫిబ్రవరి 21, మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో రియల్‌మీ 9 సిరీస్ ప్రో మొబైళ్ల సేల్ ప్రారంభం కానుంది. తొలిసేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో ఈ మొబైళ్లపై రూ.2వేల డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉండనుంది.రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ మొబైల్ 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ 90హెట్జ్ రిఫ్రెష్ రేట్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్ పైఎడమ భాగంలో చిన్న హోల్ పంచ్ కటౌట్ ఉంది. మీడియాటెక్ డైమంసిటీ 920 5జీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది రియల్‌మీ. ఈ మొబైల్‌లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుండగా.. 60వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే డాల్బీ అట్మోస్ సపోర్టు, హై-రెస్ ఫీచర్లతో ఉన్న డ్యుయల్ స్పీకర్లు ఈ ఫోన్‌కు ఇచ్చింది రియల్‌మీ.రియల్‌మీ 9ప్రో+ మొబైల్‌లో హార్ట్‌రేట్ సెన్సార్ ఉంటుంది. గుండె స్పందనలను గుర్తించడంతో పాటు రికార్డు చేసే సదుపాయం కూడా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఈ హార్ట్‌రేట్ ఫీచర్ పనిచేస్తుంది. రియల్ మీ 9 ప్రో 5జీ ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. వీడియోకాల్స్, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. లాక్ బటన్‌కే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చింది
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.