realme 9i in india know features
Realme 9i : ప్రముఖ మొబైల్ సంస్థ రియల్ మీ తక్కవ ధరకు మంచి స్పెసిఫికేషన్స్‌తో కొత్త కొత్త ఫోన్స్ పట్టుకొస్తుంది. వాటికి వినియోగదారులు ఎంతగానో ఆకర్షితులు అవుతున్నారు. తాజాగా రియల్‌మీ 9ఐ స్మార్డ్ ఫోన్ ఇండి్యాలో రిలీజ్ అయింది. రియల్ మీ సిరీస్‌లో రిలీజ్ అయిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. రియల్‌మీ 9ఐ గతంలో వియత్నాం మార్కెట్‌లో రిలీజ్ అయింది. కాబట్టి స్పెసిఫికేషన్స్ దాదాపుగా తెలిసినవే. అయితే ధర ఎంత ఉంటుందన్న ఆసక్తి రియల్‌మీ ఫ్యాన్స్‌లో కనిపించింది. రూ.15వేలలోపు ధరతో రియల్‌మీ 9ఐ ఇండియాలో మంగళవారం లాంచ్ అయింది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, పెద్ద డిస్‌ప్లే, వెనుక మూడు కెమెరాల సెటప్ తో ఈ ఫోన్ విడుదలైంది.
సరికొత్త మోడల్‌లో…రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ ఎర్లీ సేల్ జనవరి 22 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. తొలి సేల్ జనవరి 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ ఉన్న రియల్‌మీ 9ఐ బేస్ మోడల్ ధర రూ.13,999గా ఉంది. అలాగే 6జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ప్రిస్మ్ బ్లాక్, ప్రిస్మ్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. జనవరి 22 నుంచి ఫ్లిప్‌కార్ట్ , రియల్‌మీ.కామ్ లో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది.90 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 20.1:9 యాస్పెక్ట్ రేషియో ఉన్న 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో రియల్‌మీ 9ఐ వస్తోంది. డ్రాగన్ ట్రైల్ ప్రో గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. అలాగే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో నడుస్తుంది.
realme 9i in india know features
అలాగే సాఫ్ట్ వేర్ అప్‌డేట్ ద్వారా డైనమిక్ ర్యామ్ ఎక్స్ ప్యాన్షన్ సపోర్టు ఉంటుందని రియల్‌మీ పేర్కొంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్‌తో ఇప్పటికే వివో వై33టీ, వివో వై21ఇ, వివో వై21టీ, ఒప్పో ఏ36 లాంటి మోడల్స్ రిలీజ్ అయ్యాయి. వీటికి రియల్‌మీ 9ఐ పోటీ ఇవ్వనుంది. ఫొటోలు, వీడియోల కోసం రియల్‌మీ 9ఐ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2మెగాపిక్సెల్ పోట్రైట్ షూటర్, 2మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. అలాగే 16మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. లాక్ బటన్ కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనుంది.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.