Realme smart TV : చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్ మీ ఇప్పటికే స్మార్ట్ ఫోన్‌ల విషయంలో ప్రజలకు చేరువైంది. ఇప్పుడు రియల్ మీ కొత్త స్మార్ట్ టీవీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. రియల్ మీ ఎక్స్ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ మే 4 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని రియల్ మీ రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 43 అంగుళాలు, 40 అంగుళాల వేరియంట్లలో రియల్ మీ ఎక్స్ స్మార్ట్ టీవీ లభించనుంది.రియల్ మీ ఎక్స్ స్మార్ట్ టీవీ 64 బిట్ మీడియా టెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ టీవీలో 1జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఉంటుంది. 43 అంగుళాల స్క్రీన్ సైజు ధర రూ.22,999గా, 40 అంగుళాల స్క్రీన్‌తో కూడిన టీవీ ధర రూ.25,999గా రియల్ మీ నిర్ణయించింది. ఈ రెండు వేరియంట్లపై ప్రారంభ ధర కింద రూ.వెయ్యి డిస్కౌంట్ లభిస్తుంది.ఈ స్మార్ట్ టీవీలో 3డీ ఆడియో అవుట్ పుట్‌కు సపోర్ట్ చేసే 24W డాల్బీ ఆడియో స్పీకర్స్ అందించారు. 8.7 ఎంఎంతో స్లీక్‌గా, చివర్లో బెజెల్స్ కనిపించకుండా రియల్ మీ స్మార్ట్ టీవీ ఉంటుంది.ఏడు రకాల డిస్ ప్లే మోడ్స్, స్పోర్ట్, మూవీ, గేమ్, ఎనర్జీ సేవింగ్, యూజర్ మోడ్‌లలో యూజర్లు తమకు నచ్చిన మోడ్ సెలక్ట్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 11పై పని చేస్తోంది. టీవీ ప్యానెల్స్ పై రెండేళ్ల వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది.అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కోసం హాట్ కీస్ ఉన్న రిమోట్‌తో ఈ స్మార్ట్ టీవీని రూపొందించారు. ఈ స్మార్ట్ టీవీపై ఏడాది వారంటీతో పాటు రెండేళ్ల స్క్రీన్ గ్యారంటీ కూడా రియల్ మీ అందిస్తోంది. మరోవైపు రియల్ మీ బడ్స్ క్యూ2ఎస్ పేరుతో ఇయర్ బడ్స్‌ను విడుదల చేసింది. వీటి ధర రూ.1,999. మే 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఆన్‌లైన్ స్టోర్‌లలో వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉంటాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.