Realme : స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ వార్షికోత్సవం సందర్బంగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. రియల్ మీ జీటీ2 ఫోన్ పై ఏకంగా రూ.5000 ఆఫర్ అనౌన్స్ చేసింది. వార్షికోత్సవ ఆఫర్ లో భాగంగా జీటీ2 పై రూ.5000 ఆఫర్ ఇస్తోంది. అలాగే హెచ్ డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 తగ్గింపు లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ప్రారంభ వేరియంట్లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అందించారు. దీని ధర రూ.29,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా నిర్ణయించారు.
పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని సేల్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది.కాగా ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ జీటీ 2 పనిచేయనుంది. 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెచ్ జడ్ గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కల్పిస్తుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. కేవలం 33 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుంది. 65W సూపర్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా… బరువు 199.8 గ్రాములుగా ఉంది.వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు వైడ్ యాంగిల్, మాక్రో షూటర్లు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.