Redmi Smart TV 4K : అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ.. త్వరపడండి! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Redmi Smart TV 4K : అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ.. త్వరపడండి!

Redmi Smart TV 4K : ప్రముఖ సంస్థ షియోమీ నుంచి మరో స్మార్ట్ టీవీని తీసుకువస్తోంది. రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 పేరిట భారత్‌లో లాంచ్ కానుంది. 4కే రెజల్యూషన్, డాల్బీ విజన్ డాల్బీ అట్మోస్ సహా ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో ఈ టీవీ రానుంది. ఫిబ్రవరి 9న రెడ్‌మీ నోట్ 11ఎస్‌తో పాటు మన దేశంలో రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ ఎక్స్- 43ని కూడా షియోమీ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎక్స్-50, ఎక్స్-55, […]

 Authored By mallesh | The Telugu News | Updated on :31 January 2022,4:00 pm

Redmi Smart TV 4K : ప్రముఖ సంస్థ షియోమీ నుంచి మరో స్మార్ట్ టీవీని తీసుకువస్తోంది. రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 పేరిట భారత్‌లో లాంచ్ కానుంది. 4కే రెజల్యూషన్, డాల్బీ విజన్ డాల్బీ అట్మోస్ సహా ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో ఈ టీవీ రానుంది. ఫిబ్రవరి 9న రెడ్‌మీ నోట్ 11ఎస్‌తో పాటు మన దేశంలో రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ ఎక్స్- 43ని కూడా షియోమీ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎక్స్-50, ఎక్స్-55, ఎక్స్-65 మోడల్స్ ఉండగా.. వీటి కంటే కాస్త తక్కువ డిస్‌ప్లే సైజ్‌తో కొత్త టీవీ వస్తోంది.43 ఇంచుల 4కే రెజల్యూషన్ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్ టీవీ వస్తోంది. అలాగే 4కే హెచ్‌డీఆర్, డాల్బీ విజన్‌కు ఈ డిస్‌ప్లే సపోర్టు చేస్తుంది.

పర్ఫార్మెన్స్ కూడా ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఉంటుందని షియోమీ పేర్కొంది. మాలీ జీ53 జీపీయూతో కూడిన మీడియాటెక్ ప్రాసెసర్‌ ఈ టీవీలో ఉంది. అలాగే 30 వాట్ల స్పీకర్ ఔట్ పుట్, డాల్బీ అట్మోస్ సపోర్టుతో ఈ టీవీ వస్తోంది. రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ ఎక్స్43 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ (Android OS)తో నడుస్తుంది. షియోమీ లేటెస్ట్ పాచ్‌వాల్ సాఫ్ట్‌వేర్ ఇందులో ఉంటుంది. విభిన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్, యాప్స్‌ను పాచ్‌వాల్ అందిస్తుంది. అలాగే ఈ పాచ్‌వాల్ ద్వారా స్మార్ట్‌లైట్లు లాంటి స్మార్ట్ హోమ్ డివైజెస్‌ను కూడా కంట్రోల్ చేసే ఫీచర్ ఉంటుంది.

redmi smart tv with creepy features

redmi smart tv with creepy features

Redmi Smart TV 4K : రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్-43 ఫీచర్లు

రెడ్ మీ టీవీ విడుదల తేదీని వెల్లడించిన షియోమీ ఇంకా ధర ప్రకటించలేదు. ఫిబ్రవరి 9న విడుదలయ్యే ఈ టీవీ, ఎప్పుడు అమ్మకానికి వస్తుందన్న వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్-50 ధర రూ.37,999గా ఉండగా.. కొత్తగా వస్తున్న ఈ టీవీ డిస్‌ప్లే తక్కువ కావడంతో ధర కూడా తక్కువే ఉండే అవకాశముంది. రూ.30 వేలలోపు రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్- 43 వస్తే మాత్రం ఆ రేంజ్‌లో మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది