
Renu desai and Suma in Sunitha Pre wedding Celenrations
సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలె రెండో పెళ్లికి సంబంధించిన ప్రకటనను చేసిన సునీత.. ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన విషయంపై నేరుగా సోషల్ మీడియాలో స్పందించింది సునీత. తన పిల్లలు, ఫ్యామిలీ అందరూ కూడా తనకంటూ ఓ జీవితం ఉండాలని ఆశించారని అందుకే ఈ పెళ్లి చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా సునీత తన పెళ్లి విషయంపై మీడియాతోనూ మాట్లాడింది.
Renu desai and Suma in Sunitha Pre wedding Celenrations
ఇది పెళ్లి అనే కంటే. రెండు కుటుంబాల కలయికగా పిలిస్తేనే బాగుంటుంది.. ఎందుకంటే రెండు కలుస్తున్నాయనే సంతోషమేనాకు ఎక్కువగా ఉందంటూ తన పెళ్లి గురించి సునీత చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి మొదటగా ఇదే నెలలో ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆపై వాయిదా పడిందని మళ్లీ వార్తలు వచ్చాయి. పెళ్లి ఎప్పుడు ఉంటుందనే వాటిపై సునీత స్పందించలేదు. కానీ తాజాగా ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో సునీత రచ్చ చేసినట్టు కనిపిస్తోంది.
Renu desai and Suma in Sunitha Pre wedding Celenrations
వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో ఇటీవలే సునీత ప్రీవెడ్డింగ్ పార్టీని జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కొంతమంది సన్నిహితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో సుమ కూడా సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే యంగ్ హీరో నితిన్ ఈ కార్యక్రమాన్ని మొత్తం దగ్గరుండి చూసుకున్నాడని తెలుస్తోంది. దీనికి కారణం సునీతకు కాబోయే భర్త నితిన్‌కు అత్యంత సన్నిహితుడనే చర్చ జరుగుతోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.