సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ.. సుమ, రేణూ దేశాయ్‌ల సందడి

Authored By Admin | The Telugu News | Updated on : 22 December 2020, 9:18 am

సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలె రెండో పెళ్లికి సంబంధించిన ప్రకటనను చేసిన సునీత.. ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన విషయంపై నేరుగా సోషల్ మీడియాలో స్పందించింది సునీత. తన పిల్లలు, ఫ్యామిలీ అందరూ కూడా తనకంటూ ఓ జీవితం ఉండాలని ఆశించారని అందుకే ఈ పెళ్లి చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా సునీత తన పెళ్లి విషయంపై మీడియాతోనూ మాట్లాడింది.

Renu desai and Suma in Sunitha Pre wedding Celenrations

Renu desai and Suma in Sunitha Pre wedding Celenrations

ఇది పెళ్లి అనే కంటే. రెండు కుటుంబాల కలయికగా పిలిస్తేనే బాగుంటుంది.. ఎందుకంటే రెండు కలుస్తున్నాయనే సంతోషమేనాకు ఎక్కువగా ఉందంటూ తన పెళ్లి గురించి సునీత చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి మొదటగా ఇదే నెలలో ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆపై వాయిదా పడిందని మళ్లీ వార్తలు వచ్చాయి. పెళ్లి ఎప్పుడు ఉంటుందనే వాటిపై సునీత స్పందించలేదు. కానీ తాజాగా ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో సునీత రచ్చ చేసినట్టు కనిపిస్తోంది.

Renu desai and Suma in Sunitha Pre wedding Celenrations

Renu desai and Suma in Sunitha Pre wedding Celenrations

వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో ఇటీవలే సునీత ప్రీవెడ్డింగ్ పార్టీని జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కొంతమంది సన్నిహితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో సుమ కూడా సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే యంగ్ హీరో నితిన్ ఈ కార్యక్రమాన్ని మొత్తం దగ్గరుండి చూసుకున్నాడని తెలుస్తోంది. దీనికి కారణం సునీతకు కాబోయే భర్త నితిన్‌కు అత్యంత సన్నిహితుడనే చర్చ జరుగుతోంది.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి