Restaurants Bills : రూ.20 వాటర్ బాటిల్‌కి రూ.100 ఎందుకు? రెస్టారంట్ల పై బాదుడు పై కోర్ట్ ఆగ్రహం
Delhi HC raps restaurant over service charges : ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్ల ఆహార బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలను తప్పనిసరిగా విధించడం చట్టవిరుద్ధమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఈ సంవత్సరం మార్చిలో సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. కస్టమర్లు చెల్లించాలనుకుంటే మాత్రమే సర్వీస్ ఛార్జీలు చెల్లించాలి కానీ, వాటిని ఆటోమేటిగ్గా లేదా బలవంతంగా వసూలు చేయడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘన అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పు హోటల్, రెస్టారెంట్ రంగంలో పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది.

Delhi HC raps restaurant over service charges

Delhi HC raps restaurant over service charges
హైకోర్టు చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెలా నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. రెస్టారెంట్లు ఇప్పటికే ఆహార పదార్థాల ధరను ఎక్కువగా వసూలు చేస్తున్నప్పటికీ, అదనంగా సర్వీస్ ఛార్జీల పేరుతో బిల్లులు వేయడం అన్యాయం అని కోర్టు పేర్కొంది. ఉదాహరణకు రూ.20 ధర ఉన్న వాటర్ బాటిల్‌ను రూ.100కి అమ్మి, దానిపై మరలా సర్వీస్ ఛార్జీలు వేయడం వినియోగదారుల హక్కులను కాలరాయడమేనని కోర్టు హెచ్చరించింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) 2022లో జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థిస్తూ, ఛార్జీలు స్వచ్ఛందంగా ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ నిర్ణయం వినియోగదారులకు పెద్ద ఊరటను కలిగించింది. ఇకపై రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలను బలవంతంగా వసూలు చేయలేరు, చెల్లించకపోతే సేవలు నిరాకరించడం కూడా చట్టవిరుద్ధం అవుతుంది. కోర్టు సూచనల ప్రకారం, రెస్టారెంట్లు ఈ మొత్తాన్ని “స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్” లేదా “వాలంటరీ కంట్రిబ్యూషన్” పేర్లతో స్పష్టంగా పేర్కొనవచ్చు కానీ, వాటిని తప్పనిసరిగా బిల్లుల్లో కలపరాదు. ఈ తీర్పు వినియోగదారుల హక్కులను కాపాడటంలో ఒక కీలక ముందడుగుగా భావించబడుతోంది.