Bandi Sanjay – Revanth Reddy : వైరల్ వీడియో.. బీజేపీ నాయకులతో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్
Bandi Sanjay – Revanth Reddy : తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అంటే బద్ధశత్రువులు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రెండు జాతీయ పార్టీలు. జాతీయ స్థాయిలోనూ ఈ రెండు పార్టీలు బద్ధశత్రువులే. తెలంగాణలో రాజకీయాలు అంటే మామూలుగా ఉండదు మరి. అయితే.. ఏ పార్టీ నాయకులు అయినా మరో పార్టీ నాయకులను నేరుగా తిట్టరు. నేరుగా పల్లెత్తుమాట కూడా అనరు. మీడియా ముందు మాత్రం రెచ్చిపోతారు. వాడు అట్ల.. వీడు ఇట్ల అంటారు. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరికి మరొకరు తారసపడ్డారు. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ ఎంపీలు అందరూ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో రెండు పార్టీల ఎంపీలు పార్లమెంట్ బయట తారసపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరూ తారసపడి ఒకరికి మరొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
Bandi Sanjay – Revanth Reddy : నవ్వుతూ పలకరించిన రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలుసుకొని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు అందరూ కాసేపు సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవైపు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటూ ఉంటే.. ఒకరిని మరొకరు విమర్శించుకుంటూ ఉంటే.. ఆయా పార్టీల అధ్యక్షులు మాత్రం ఒకరికి మరొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ పలకరించుకుంటారా? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.