
Revanth Reddy clarifies on huzurabad by election defeat
Revanth Reddy : హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ టైమ్ లో తనపై వచ్చిన విమర్శలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన రాగా అసలేం జరిగిందో చేప్పేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ వీడిన తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరడం తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక తథ్యం అయింది. కాగా ఈ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చకు దారీతీసింది.అధికార టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ ను బరిలోకి దింపగా… బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంలో కాస్తా ఆలస్యం అయింది. ఎందుకంటే అక్కడి కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి అనూహ్యంగా టీఆర్ఎస్ లో చేరగా మరో అభ్యర్థిని ఎంపిక చేశారు.
ఎట్టకేలకు కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను బరిలోకి దింపారు. అయితే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక జరుగుతున్న మొదటి ఎన్నిక. దీంతో కాంగ్రెస్ లో మంచి ఊపు కనిపించింది. కానీ రాజేందర్ సానుభూతి ముందు ఎవరి పప్పులు ఉడకలేదు. టీఆర్ఎస్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పథకాల వర్షం కురిపించినా రాజేందర్ దాటికి నిలబడలేకపోంది. కేసీఆర్ కు.. రాజేందర్ కు పోటీ అన్నట్లుగా జరిగాయి. దీంతో దేశమంతా తెలంగాణ వైపే చూశాయి.ఈ ఎలక్షన్ లో ఈటల రాజేందర్ గెలిచాక రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ నాయకులే రేవంత్ పై అనేక ఆరోపణలు చేశారు. లోపాయికారీగా ఓ అభ్యర్థితో కుమ్మక్కై సరైన అభ్యర్థిని ఎంపిక చేయలేదనే విమర్శలు వచ్చాయి. ఈఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 3000 కు పైగా ఓట్లుతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో రేవంతే ఓటమికి కారణమని ఆరోపించారు.
Revanth Reddy clarifies on huzurabad by election defeat
దీంతో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రేవంత్ ఈ ఎన్నికపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికను సాధారణ ఎన్నికలతో పోల్చలేమని… ఉప ఎన్నికలో ఎక్కువగా వ్యక్తుల ప్రభావితం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఉప ఎన్నిక గురించి ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన కొండా సురేఖ ఓటమి గురించి మాట్లాడారు. పలు ఉప ఎన్నిక సందర్భాలు గుర్తు చేస్తూ సమర్థించుకున్నారు. అయితే తెలంగాణలో కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.నిజానికి రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టాకే తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఊపు తెచ్చింది. అది కేవలం రేవంత్ కు ఉన్న క్రేజ్ అనే చెప్పాలి. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి కేడర్ ఉంది. దానికి రేవంత్ తోడవ్వడంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి వస్తామని ధీమ వ్యక్తం చేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.