Ridge Gourd Benefits | బీరకాయ తినటంలో ఆరోగ్య రహస్యాలు.. ఫైబర్ నుంచి లివర్ డిటాక్స్ వరకు లాభాలే లాభాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ridge Gourd Benefits | బీరకాయ తినటంలో ఆరోగ్య రహస్యాలు.. ఫైబర్ నుంచి లివర్ డిటాక్స్ వరకు లాభాలే లాభాలు

 Authored By sandeep | The Telugu News | Updated on :14 September 2025,10:00 am

Ridge Gourd Benefits | ఆకుకూరల మాదిరిగానే కూరగాయలు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు పోషకంగా సమతుల్యంగా ఉన్న ఆహారం తీసుకోవాలని ప్రతీసారి సూచిస్తున్నారు. అలాంటి అత్యంత ఆరోగ్యకరమైన కూరగాయలలో బీరకాయ ఒకటి.

#image_title

బీరకాయలో ఉండే ముఖ్యమైన పోషకాలు:

ఫైబర్, విటమిన్ A, C, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, బీటా కెరోటిన్

బీరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1. బరువు తగ్గాలనుకుంటున్న వారికి బెస్టు:

బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో త్వరగా నిండిన ఫీలింగ్ కలిగి, తక్కువ తినే అలవాటు వస్తుంది. ఇది బరువు తగ్గే ప్రయాణానికి సహాయపడుతుంది.

2. మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది:

బీరకాయలో ఉండే సెల్యులోజ్ అనే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడంలో ఇది సహాయపడుతుంది.

3. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు:

ఇన్సులిన్ ఉత్పత్తిని సహాయపడే గుణాల వలన బీరకాయ రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. ఇది ఇతర అవయవాలకు కూడా రక్షణ ఇస్తుంది.

4. కంటి ఆరోగ్యానికి మంచిది:

బీటా కెరోటిన్ అధికంగా ఉండటంతో కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వయస్సు పెరిగేకొద్దీ కంటికి వచ్చే సమస్యలను కూడా అడ్డుకుంటుంది.

5. లివర్ డిటాక్స్ & రక్తహీనత నివారణ:

బీరకాయలో ఉండే పేప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ లివర్ శుభ్రతలో సహాయపడతాయి. ఐరన్ అధికంగా ఉండటంతో రక్తహీనత (అనీమియా) నివారణకు తోడ్పడుతుంది.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది