Rohit Sharma : నిలకడ, దూకుడితో అదరగొడుతున్న రోహిత్.. చివరి 12 ఇన్నింగ్స్ లు చూస్తే..!
Rohit Sharma : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆగస్టు 2న శుక్రవారం కొలంబోలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలైంది. ప్రేమదాస స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో తక్కువ పరుగులకే శ్రీలంక పరిమితం కావడం, అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ప్రారంభం అందించడంతో, భారత్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. కానీ హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత వన్డే ఆడుతున్న రోహిత్ మొదటి ఓవర్ నుంచే బాదుడు మొదలు పెట్టాడు. . కేవలం 47 పరుగులకే 58 పరుగులు చేసి భారత్‌కి అద్భుత ప్రారంభం అందించాడు.
రోహిత్ శర్మ్ క్రీజులోకి రాగానే, శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మొదటి ఓవర్ రెండో బాల్‌నే సిక్స్ బాదాడు. అదే ఓవర్‌లో మరో ఫోర్ కొట్టాడు. ఓ ఎల్‌బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్న రోహిత్, తర్వాత జోరు మరింత పెంచాడు. శ్రీలంక బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించి, వారిని ఒత్తిడిలోకి నెట్టాడు. ఇక రెండో వన్డేలో కూడా రోహిత్ శర్మ అదరగొట్టాడు. 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఉన్నంత సేపు కూడా బౌలర్స్ వణుకుతూనే ఉన్నారు. 37 ఏళ్ల రోహిత్ మూడు క్రికెట్ ఫార్మాట్లలో కలిపి ప్రపంచంలేనే అత్యధిక సిక్సులు బాదిన రికార్డు దక్కించుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు.
Rohit Sharma : నిలకడ, దూకుడితో అదరగొడుతున్న రోహిత్.. చివరి 12 ఇన్నింగ్స్ లు చూస్తే..!
రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 15,000 పరుగులు పూర్తి చేశాడు. అయితే ఆయన గత 12 ఇన్నింగ్స్‌లు గమనిస్తే.. 131(84), 86(63), 48(40), 46(40), 87(101), 4(2), 40(24), 61(54), 47(29), 47(31), 58(47), 64 (44) గా ఉన్నాయి. 37 ఏళ్ల వయస్సులో ఇంత నిలకడగా, జట్టుకి విలువైన పరుగులు చేస్తున్న రోహిత్ శర్మని ప్రతి ఒక్కరు పొగిడేస్తున్నారు. శ్రీలంకతో జరిగిన ఇన్నింగ్స్‌లో రోహిత్ స్పిన్ బౌలింగ్ చేశాడు. 37 ఏళ్ల 96 రోజుల వయసులో టీమిండియా తరపున వన్డేల్లో బౌలింగ్ చేసిన మూడో అతి పెద్ద వయసున్న స్పిన్నర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.