Sai Dharam Tej : మెగా ఫ్యామిలీలో పెళ్లిసందడి.. మేనల్లుడి లవ్ మ్యాటర్ సెటిల్ చేసిన మెగా మామయ్య..!
ప్రధానాంశాలు:
Sai Dharam Tej : మెగా ఫ్యామిలీలో పెళ్లిసందడి.. మేనల్లుడి లవ్ మ్యాటర్ సెటిల్ చేసిన మెగా మామయ్య..!
Sai Dharam Tej : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలు కాబోతుందా.. మెగాస్టార్ రంగంలోకి దిగడంతో నిన్నటిదాకా సమస్యగా ఉన్న ఈ ఇష్యూ కాస్త సొల్యూషన్ దొరికేసిందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇంతకీ విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi మేనల్లుడు సాయి దుర్గ తేజ్ పెళ్లి విషయమై చిరంజీవి రంగలోకి దిగి సమస్య పరిష్కరించాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా సాయి తేజ్ ఒక అమ్మాయిని ప్రేమించగా సాయి తేజ్ మదర్ దానికి ఒప్పుకోవట్లేదట. ఐతే ఇన్నాళ్లు ఈ విషయం చిరంజీవి దాకా వెల్లలేదు. ఐతే తేజ్ పెళ్లి మ్యాటర్ మెగా ఫ్యామిలీలో చర్చ మొదలవగా చిరంజీవి జరిగిన విషయం తెలుసుకుని తన సోదరిని ఒప్పించి ఈ పెళ్లికి లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది.
Sai Dharam Tej : హీరోయిన్ పీకల్లోతు ప్రేమలో..
తేజ్ తో లవ్ లో ఉన్న అమ్మాయి ఎవరు.. ఆమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తా లేక బయట అమ్మాయా.. అంతకుముందు సాయి తేజ్ తో ఒక హీరోయిన్ పీకల్లోతు ప్రేమలో ఉందన్న వార్తలు తెలిసిందే. మరి తేజ్ వేరే అమ్మాయిని చేసుకుంటే ఆ హీరోయిన్ ఏమవుతుంది. ఇంతకీ ఈ విషయం ఇన్నాళ్లు తేజ్ ఎందుకు దాచాడు లాంటి విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.
యాక్సిడెంట్ తో రెండేళ్లు కెరీర్ లో వెనకపడ్డ తేజ్ తన పెళ్లి విషయంలో కూడా చాల జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. ప్రేమించిన అమ్మాయి ఐతే తేజ్ ని బాగా చూసుకుంటుందని ఆమెతోనే ఇచ్చి పెళ్లి చేసేలా చిరంజీవి ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఐతే తేజ్ ప్రేమించి పెళ్లాడుతున్న అమ్మాయి డీటైల్స్ ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. ఏది ఏమైనా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య ని ప్రేమించి పెళ్లాడాడు. ఇప్పుడు తేజ్ కూడా అదే దారిలో లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. మెగా అభయం ఉంది కాబట్టి తేజ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. తేజ్ ఓ పక్క వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఐతే పెళ్లి చేసుకునేందుకు కొంత టైం తీసుకుంటాడని తెలుస్తుంది. Mega Hero, sai dharam tej, Chiranjeevi, Mega Family, Tollywood