sajjala ramakrishna reddy proof about pattabhi
Sajjala – Pattabhi : ప్రస్తుతం ఏపీలో పట్టాభి ఎపిసోడ్ ఎంత చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పట్టాభి గన్నవరం వెళ్లి అక్కడ ఓవర్ యాక్షన్ చేయడం, ఆ తర్వాత పోలీసులతో గొడవలు.. పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కోర్టుకు వెళ్లడం ఇవన్నీ ఇప్పుడు ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. దీనిపై తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడి టీడీపీ బండారం మొత్తం బట్టబయలు చేశారు. వీళ్లకు ఎల్లో మీడియా ఉంది.
sajjala ramakrishna reddy proof about pattabhi
అందులో ఏం రాస్తే అదే కరెక్ట్ కాదు కదా. ప్రజలు వాళ్ల దృష్టిలో వెర్రి వాళ్లు. ఎన్నికలు వచ్చినప్పుడే ఇబ్బుడి ముబ్బుడిగా హామీలు గుప్పిస్తారు. అధికారంలో ఉంటే.. హామీలు నెరవేర్చకపోవడం.. ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్నవాళ్లపై విమర్శలు చేయడం.. ఇదే వీళ్ల పని అంటూ సజ్జల ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ మరణానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. ఈయన టీడీపీని దించి ఈరోజుకు కూడా ఎన్టీఆర్ కు పూల మాల వేస్తున్నారు. అలాంటి వాళ్ల గురించి ఇంకేం చెప్పాలి. నాయకుడిని చూసే పార్టీ నాయకులు నేర్చుకుంటున్నారు.
పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో వాళ్ల అధ్యక్షుడి ముందే ఎలా మాట్లాడుతున్నారు. గన్నవరం వస్తా అని పట్టాభి సవాల్ విసరడం, ఇతను వెళ్లాల్సిన అవసరం ఏంటి. వంశీని, నానిని ఇష్టం ఉన్నట్టుగా బూతులు తిట్టాడు. ముఖ్యమంత్రిని కూడా తిట్టాడు. వాటి అవసరం ఏంటి. ఇక్కడ తిడతారు.. గన్నవరం వెళ్లి అక్కడ తిడతావు. తిట్టిన దాని మీద రియాక్షన్ వస్తే.. నువ్వు ఈ క్రమంలో పోలీసు అధికారుల మీద కూడా దాడి చేస్తావా? అలా చేస్తే కేసులు పెట్టరా? అంటూ పట్టాభి అరెస్ట్ పై సజ్జల చెప్పుకొచ్చారు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.