YSRCP : మే నెలలో గడప గడపకు ఎమ్మెల్యేలు.. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో జోరు
YSRCP : ఆంధ్రప్రదేశ్లో ప్రజల వద్దకు పాలనను తీసుకు వెళ్లేందుకు వైకాపా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ను ఏర్పాటు చేసి అత్యంత సులువుగా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగిపోయేలా చేసింది. వాలంటీర్ లు ఇంటికి వచ్చి ప్రజలకు కావలసిన అవసరాలను తీర్చడం ద్వారా గ్రామస్తుల నుండి పట్టణాల్లో ఉండే వారి వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా కూల్ గా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం లభిస్తుంది. అలాగే ప్రభుత్వ పథకాలను ఈజీగా ఉపయోగించుకుంటున్నారు.ప్రభుత్వం యొక్క పథకాలను వాటి ద్వారా వచ్చే లబ్ధి పొందుతున్నారు. కింది స్థాయిలో ఉన్న వ్యవస్థ ఎలా పని చేస్తుంది
అనే విషయాన్ని తెలుసుకునేందుకు మే నెలలో ఎమ్మెల్యేలు నియోజక వర్గంలోని ప్రతి ఇంటి తలుపులు తట్టి అభివృద్దిని వివరించబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలియ జేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయా లేదా అనే విషయాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగాలని సూచించారు. మే నెలలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని మరియు ప్రతి వ్యక్తిని కలిసి అందుతున్న ప్రభుత్వ పథకాలు మరియు కావలసిన పథకాల గురించి చర్చించి జరుగుతున్న అభివృద్ధిని వివరించ బోతున్నారు.రాష్ట్రంలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ గా ఎమ్మెల్యేలు పని చేయాలని ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలనుసారం ఎమ్మెల్యేలు అంతా కూడా పార్టీ పరంగా మరియు ప్రభుత్వ పరంగా జరుగుతున్న అభివృద్ధిని కింది స్థాయి లో వివరిస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే మే నెలలో గడప గడపకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను కళ్ళకు కట్టినట్లుగా ఎమ్మెల్యేలు మరియు వారి సన్నిహితులు వైకాపా కార్యకర్తలు తెలియజేయ పోతున్నారని సజ్జల తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం అవకాశం కల్పించకుండా గతంలో గెలిచిన సీట్ల కంటే మరిన్ని సీట్లను వైకాపా గెలిచే ప్రయత్నాలు చేస్తోంది.