Samantha : సమంత జీవితం లో ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే , వింటుంటే దిమ్మ తిరిగిపోద్ది !
ప్రధానాంశాలు:
Samantha : సమంత జీవితం లో ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే , వింటుంటే దిమ్మ తిరిగిపోద్ది !
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఆమె కెరీర్ ఆరంభంలో తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు శీను’ సినిమా సమయంలో, సమంతకు రెమ్యూనరేషన్ గా నగదు ఇచ్చే బదులు, ఒక ఫామ్ హౌస్ ను పారితోషికంగా ఇచ్చారట. అప్పట్లో కోటి రూపాయల విలువ చేసే ఆ ఆస్తి విలువ ప్రస్తుతం కొన్ని రెట్లు పెరగడం, సమంత ఆర్థికంగా తీసుకున్న ఒక మాస్టర్ ప్లాన్ గా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Samantha : సమంత జీవితం లో ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే , వింటుంటే దిమ్మ తిరిగిపోద్ది !
Samantha వ్యక్తి గత విషయంలో కీలక నిర్ణయం
సమంత వ్యక్తిగత జీవితంలో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న ఆమె, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తన పేరును కూడా ‘సమంత నిడిమోరు’ గా మార్చుకోవాలని ఆమె డిసైడ్ అయ్యింది. తన భర్త రాజ్ నిడిమోరు కథను అందించిన చిత్రంతోనే ఈ పేరు మార్పును అధికారికంగా ప్రకటించబోతుండటం విశేషం.
Samantha ‘మా ఇంటి బంగారం’ తో వస్తున్న సమంత
ప్రస్తుతం సమంత, నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో ఆమె పేరు ‘సమంత నిడిమోరు’ అని కనిపించబోతుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు కెరీర్ పరంగా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన సమంత, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కేవలం నటిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించుకోవడంలో సమంత ఎప్పుడూ ముందుంటారని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.