Samsung laptops : సామ్ సంగ్ కంపెనీ తన బ్రాండ్ ల్యాప్ టాప్స్‌ను భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ప్రీమియమ్ నుంచి బడ్జెట్ వరకు ఆయా రేంజ్‌లలో వీటిని తీసుకొచ్చింది. గెలాక్సీ బుక్ 2 360 సిరీస్, గెలాక్సీ బుక్ 2 సిరీస్.. గెలాక్సీ బుక్ 2 బిజినెస్.. గెలాక్సీ బుక్ గో వంటి ల్యాప్‌టాప్స్‌ను రిలీజ్ చేసింది. ఒకేసారి ఆరు ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసింది. ఇందులో కొన్ని 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో రిలీజ్ కాగా.. బడ్జెట్ ల్యాపీ సామ్‌సంగ్ గెలాక్సీ బుక్ గో స్నాప్‌డ్రాగన్ చిప్‌తో విడుదల చేశారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వీటిని తీసుకొచ్చారు.
సమ్ సంగ్ గెలాక్సీ బుక్ 2 ప్రో 360 ప్రారంభ ధర రూ.1,15,990గా ఫిక్స్ చేశారు. గెలాక్సీ బుక్ టూ ప్రో ప్రారంభ ధర రూ.1,06,990 కాగా, గెలాక్సీ బుక్ 2 360 స్టార్టింగ్ ప్రైజ్ రూ.99,990 గా ఉంది. గెలాక్సీ బుక్ గో ప్రారంభ ధర రూ.38,990 గా నిర్ణయించారు. గెలాక్సీ బుక్ 2 ప్రారంభ ధర రూ.65,990 ఉండగా, గెలాక్సీ బుక్ 2 బిజినెస్ ప్రారంభ ధర రూ.1,04,990గా నిర్ణయించారు.
సామ్‌సంగ్ గెలాక్సీ బుక్ 2 ప్రో సిరీస్ ప్రీ రిజర్వేషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. గెలాక్సీ బుక్ 2 బిజినెస్‌తో పాటు గెలాక్సీ గో ల్యాప్‌టాప్స్ ప్రీ బుకింగ్ సైతం సామ్‌సంగ్ వెబ్‌సైట్ లో స్టార్ట్ అయింది. గెలాక్సీ బుక్ 2 360, గెలాక్సీ బుక్ 2 సేల్ త్వరలోనే ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. ప్రీ రిజర్వేషన్, ప్రీ బుకింగ్స్ పైన రూ.5000వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ల్యాప్ టాప్స్ బడ్జెట్ ప్రైస్ లోనే వస్తున్నాయి. కాబట్టి ఇవి ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోయే చాన్స్ ఉంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.