SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్‌లు అందిస్తూనే ఉంటుంది. చాలా సెక్యూర్డ్‌గా సేవలు కొనసాగనుండగా, అప్పట్లో పాన్-ఆధార్ అనుసంధానం చేసింది. అయితే బ్యాంక్‌లో ప్రతి నెలా డబ్బులు దాచుకునే వారికి తీపికబురు అందించింది. రికరింగ్ డిపాజిట్లపై RD కూడా వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్‌లో ప్రతి నెలా డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం కలుగనుంది. అధిక రాబడి లభించనుంది. ఇది ఫిబ్రవరి 15 నుంచే అమలులోకి వచ్చింది.
మీరు రూ.100 కనీస డిపాజిట్ మొత్తంతో ఎస్‌బీఐలో ఆర్‌డీ అకౌంట్ తెరవొచ్చు.రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను ఏడాది నుంచి 10 ఏళ్ల కాల పరిమితితో ఓపెన్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న టెన్యూర్ వరకు ప్రతి నెలా డబ్బులు కడుతూ వెళ్లాలి. ఏడాది నుంచి రెండేళ్ల కాల పరిమితిలోని ఆర్‌డీ ఖాతాలపై 5.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఆర్‌డీలపై 5.2 శాతం వడ్డీ పొందొచ్చు. మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు రికరింగ్ డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీ వస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఆర్‌డీలపై 5.5 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు.
మరోవైపు ఎస్‌బీఐ 2 ఏళ్లకు పైన కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ ఎఫ్‌డీలపై ఇకపై 5.2 శాతం వడ్డీ లభిస్తుంది.అదే మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లను గమనిస్తే.. వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. దీంతో ఈ ఎఫ్‌డీలపై ఇకపై 5.45 శాతం వడ్డీ పొందొచ్చు. అలాగే ఐదేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల మేర పైకి కదిలింది. దీంతో ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.5 శాతానికి చేరింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలకు మాత్రమే వర్తిస్తాయి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.