Mohan Babu : విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో నాలుగు దశాబ్దాలకుపైగా దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ గొప్ప గుర్తింపును తెచ్చుకొన్న మోహన్ బాబు అశేష ప్రేక్షకాదరణ పొందాడు. తాజాగా సన్నాఫ్ ఇండియా చిత్రాన్ని సొంత బ్యానర్‌పై డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో మోహన్ బాబు పలు విషయాలపై కూడా స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు.ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. సాధారణంగా నేను ట్రోలింగ్స్, మీమ్స్‌ను పట్టించుకోను. ఎవరైనా నాకు పంపినప్పుడే చూస్తాను. ఎదుటి వారిని ట్రోలింగ్ చేయవచ్చునేమో నాకు తెలియదు కానీ.. వ్యగ్యంగా ట్రోల్ చేయడం అనేది బాధాకరంగా ఉంటుంది.
ఇద్దరు హీరోలు యాబై నుంచి వంద మందిని ట్రోలింగ్ చేయడానికనే నియమించుకుని ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవరో కూడా నాకు తెలుసు. వారిని ప్రకృతి గమనిస్తోంది. వారికి ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు. అప్పుడు వారి వెనుక ఎవరూ ఉండరు. ఎవరూ సహాయపడరు’’ అన్నారు మోహన్ బాబు.ప్రస్తుతం మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. ఇదిలా ఉంటే మా ఎన్నికల్లో గెలిచిన అనంతరం మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడలో కలుసుకున్నారు.
వీరు హఠాత్తుగా కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్ గా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా మంచు విష్ణు ఇంటికి వచ్చి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆ విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడగానే విష్ణు తప్పుడు వార్తలపై అప్సెట్ అయ్యాడు.సీఎంతో మీటింగ్ తర్వాత మాట్లాడిన మంచు విష్ణు.. మొన్న జరిగిన చర్చల్లో మిస్ కమ్యూనికేషన్ జరిగిందని అంటూ నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చినప్పటికి కూడా ఆయనకు అందజేయలేదని అన్నారు. ఇక నాన్న గారికి ఇన్విటేషన్ అందకపోవడం పై కూడా ఫిల్మ్ ఛాంబర్ లో చర్చిస్తాం అంటూ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ నాన్న గారు అని అన్నారు. ఇక అలా ఎవరు ఇలా చేశారో మాకు తెలుసని అంటూ ఎలా కరెక్ట్ చేయాలో మేము ఆలోచిస్తామని విష్ణు అన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.