Home » Exclusive » School Grl Commits Suicde In Kumuram Bheem Asifabad
Exclusive

Kumuram Bheem Asifabad : చదువులో స్కాలర్.. కానీ ఆత్మహత్య చేసుకున్న యువతి.. ఎందుకో తెలుసా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 4, 2023, 2:20 pm
Advertisement

Kumuram Bheem Asifabad : ఆ అమ్మాయి చదువులో చాలా చురుకు.. స్కాలర్ అని చెప్పుకోవాలి. తల్లిదండ్రులు కూడా తనను బాగా చదివించారు. జీవితంలో ఆ అమ్మాయి ఉన్నత స్థానంలో స్థిరపడాలని కోరుకున్నారు. కానీ.. అర్థాంతరంగా ఆ అమ్మాయే తన జీవితాన్ని ముగించేసుకుంటుందని అనుకోలేదు కాబోలు. ఆ బాలిక పేరు సువర్ణ. వయసు 16. తెలంగాణలోని కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్ అనే గ్రామం తన సొంతూరు. సువర్ణకు గత కొంతకాలం నుంచి

Advertisement

తీవ్రంగా కడుపు నొప్పి వస్తోంది. ఆ కడుపు నొప్పి తగ్గడం కోసం తన తల్లిదండ్రులు చాలా ప్రయత్నించారు. చాలా ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ.. ఫలితం దక్కలేదు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా తన కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. ఇటీవల మళ్లీ సువర్ణకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. విపరీతంగా కడుపు నొప్పి రావడంతో ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. ఆ నొప్పిని తట్టుకోలేకపోయిన సువర్ణ..

school grl commits suicde in Kumuram Bheem Asifabad

Advertisement

నొప్పిని తట్టుకోలేక పురుగుల మందు తాగిన సువర్ణ

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగింది. వెంటనే స్థానికులు ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. అయినా కూడా ఆ బాలిక ప్రాణాలు నిలవలేదు. ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. జీవితంలో ఎంతో సాధించాలనుకున్న ఆ బాలిక కడుపు నొప్పిని భరించలేక ప్రాణాలు తీసుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఆ బాలికను చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి