Categories: News

Cricketer | డ్ర‌గ్స్‌కి బానిసైన‌ జింబాబ్వే మాజీ కెప్టెన్ షాన్ విలియమ్స్ .. ముగిసిన అంతర్జాతీయ కెరీర్

Cricketer |జింబాబ్వే క్రికెట్‌లో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్ షాన్ విలియమ్స్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ అకస్మాత్తుగా ముగిసింది. మాదకద్రవ్యాల వ్యసనానికి చికిత్స పొందేందుకు రెహాబిలిటేషన్ కార్యక్రమంలో చేరిన అనంతరం, ఆయన్ను ఇకపై జాతీయ జట్టులో ఎంపిక చేయబోమని జింబాబ్వే క్రికెట్ బోర్డు (ZC) మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

#image_title

కెరీర్‌కి ముగింపు..

బోర్డు తన ప్రకటనలో “విలియమ్స్‌పై నిర్ణయం సులభం కాదు. కానీ మా కాంట్రాక్ట్ ప్లేయర్లు అత్యున్నత ప్రొఫెషనలిజం, క్రమశిక్షణ, యాంటీ-డోపింగ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. విలియమ్స్ గతంలో పలు సందర్భాల్లో క్రమశిక్షణా ఉల్లంఘనలు, అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు చోటుచేసుకున్నాయి. ఇవి జట్టు ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపించాయి” అని పేర్కొంది.

గత సెప్టెంబర్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా క్వాలిఫయర్‌కు విలియమ్స్ అందుబాటులో లేకపోవడంతో బోర్డు అంతర్గత విచారణ చేపట్టింది. ఆ విచారణలో విలియమ్స్ స్వయంగా “కొంతకాలంగా మాదకద్రవ్యాల వ్యసనంతో బాధపడుతున్నాను, ప్రస్తుతం దానికి చికిత్స పొందుతున్నాను” అని వెల్లడించినట్లు జింబాబ్వే క్రికెట్ తెలిపింది. 39 ఏళ్ల షాన్ విలియమ్స్ 2005లో జింబాబ్వే తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, ముఖ్యంగా వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 164 వన్డేల్లో 5217 పరుగులు సాధించి, బౌలింగ్‌లో 86 వికెట్లు తీశారు. ఆయన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 4/43.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

3 days ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

4 days ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

4 days ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

4 days ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

4 days ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

4 days ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

5 days ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

5 days ago