Daughter : మీ పాప పేరు మీద రూ.3000వేల దాచుకుంటే రూ.16లక్షలు వస్తాయి.. స్కీమ్ ఏంటంటే..!
Daughter : మనిషి రాతి యుగం నుండి రాకెట్ యుగానికి చేరుకున్నాడు. అయితే ఆధునిక కాలానికి చేరుకునే పరిణామక్రమంలో చాలా మార్పులు చోటుచేసుకుంటుండడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఒంటింటికే పరిమితమైన మగువలు ఇప్పుడు మగాళ్లతో సమానస్థాయికి చేరుకున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు… ఇలా అదీఇదని కాదు ప్రతి రంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు. ప్రభుత్వాలు కూడా మహిళా సాధికారత కోసం కృషిచేస్తున్నారు.అయితే కాలం ఎంత మారిన కూడా కొన్ని కుటుంబాలలో ఆడబిడ్డలని ఇబ్బందిగానే ఫీలవుతుంటారు.
లింగ వివక్ష చూపిస్తూ మగపిల్లలను చదవించడం, ఉద్యోగాలు చేయిస్తూ… ఆడపిల్లలను ఇంటి పనులకు పరిమితం చేసే అనేక కుటుంబాలు మన సమాజంలో కనిపిస్తుంటాయి. అంతేకాదు ఎప్పుడెప్పుడు ఆడపిల్లకు పెళ్లిచేసి భారం దింపుకుందామా అనుకునే తల్లిదండ్రులు వున్నారు. చివరకు ఆడబిడ్డ అని తెలిస్తే కడుపులో పిండాన్ని, పురిటి బిడ్డను చంపిన సంఘటనలు అనేకం. మనం మన కుమార్తెల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం గురించి చర్చించినప్పుడు, అనుకోకుండానే సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రస్తావన వస్తుంది. సుకన్య సమృద్ధి అకౌంట్ దీర్ఘకాలంలో వారు పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవాలన్న ఉద్దేశంతో ఈ పథకం లాంఛ్ అయింది.
ఈ స్కీంలో పెట్టుబడులతో పాత పన్ను విధానం ప్రకారం.. సెక్షన్ 80C ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏటా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తుంటుంది. గతేడాది ఈ వడ్డీ రేట్లను పెంచగా.. తర్వాత స్థిరంగానే ఉంచుతోంది. ప్రస్తుతం దీంట్లో వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది.ఈ స్కీం వివరాలకు వస్తే ఏడాదికి కనీసం రూ. 250 తో చేరొచ్చు. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మధ్యలో మీరు ఈ రేంజ్‌లో ఎంత మొత్తంలో అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా వరుసగా 15 సంవత్సరాలు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆడపిల్లకు 10 సంవత్సరాల లోపే ఈ స్కీంలో చేరాలి. వారి పేరిట తల్లిదండ్రులు లేదా గార్డియెన్ అకౌంట్ తెరవొచ్చు. పోస్టాఫీస్ లేదా ఏదైనా బ్యాంకుకు వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలకు ఛాన్స్ ఉంటుంది. కవలలు లేదా ట్రిప్లెట్స్ ఆడపిల్లలు అయినప్పుడు 3 ఖాతాలు తెరిచేందుకు అవకాశం ఉంటుంది.
Daughter : మీ పాప పేరు మీద రూ.3000వేల దాచుకుంటే రూ.16లక్షలు వస్తాయి.. స్కీమ్ ఏంటంటే..!
సుకన్య యోజన సమృద్ది యోజన పథకం కింద డబ్బులు పొదుపు చేయాలనుకునే పేరెంట్స్ సమీపంలోని బ్యాంకు లేదంటే పోస్టాఫీసును సందర్శించండి. అక్కడ సుకన్య సమృద్ది యోజన ఫారం అందుబాటులో వుంటుంది. అందులో అడిగిన సమాచారాన్ని ఇవ్వండి. అలాగే ఆమ్మాయి భర్త్ సర్టిఫికేట్, ఏదయినా గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి), నివాస రుజువు పత్రాలు జతచేసి అందించాలి. బ్యాంకు లేదా పోస్టాఫీస్ సిబ్బంది మీ దరఖాస్తును స్వీకరించి అన్ని సరిగ్గా వున్నాయంటే ఓ పొదుపు ఖాతాను ఓపెన్ చేస్తారు. ఇందులో ప్రతినెలా కొంతమొత్తం జమ చేయాలి. కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1,50,000 లను ప్రతి నెలా జమ చేయవచ్చు. ఇలా 15 ఏళ్లపాటు పొదుపు చేయాలి… 21 ఏళ్ల తర్వాత మనం డబ్బులను పొందవచ్చు. అసలుతో పాటు భారీ వడ్డీ కలిసి మనకు తిరిగివస్తుంది.
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
This website uses cookies.