Home » Andhra Pradesh » Ys Jagan Attack On Ap Cm Chandrababu
andhra pradesh

YS Jagan : బాబు గ్రాఫ్ పడిపోతుంది.. హామీలు నెరవేర్చలేదన్న జగన్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 8, 2024, 9:00 am
Advertisement

YS Jagan : ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై విమర్శలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రెండు నెలలు తిరగక ముందే గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. తమ పార్టీ నేత ఒకరిని టీడీపీ వాళ్లు కొట్టి హత్యాయత్నం చేశారు ఇలా కక్ష సాధింపులు చేస్తే మేము కూడా తిరిగి అదే విధంగా చేస్తామని అన్నారు జగన్. విజయవాడ హాస్పిటల్ లో వైసీపీ నేతని పరామర్శించిన ఆన మీడియా వేదికగా చంద్రబాబు పాలనను దుయ్యబట్టారు. బాబుపై అన్ని విధాలుగా వ్యతిరేకత వస్తుందని అసలైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ్మ మీద కొంతకాలం మోజు ఉంటుంది కానీ చంద్రబాబు చేస్తున్న తప్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని పరిస్థితి దారుణంగా మారిందని విమర్శించారు జగన్.

Advertisement

YS Jagan హామీలను గాలికి వదిలేశారు..

ఎలక్షన్ టైం లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్ని ఇప్పుడు గాలికి వదిలేశారు. అమ్మ ఒడిని పతకాన్ని తల్లికి వందనంగా మార్చారు కానీ అది అమలు చేయట్లేదు. రైతు భరోసా తో పాటు మహిళలకు ఇస్తానన్న 1500 రూపాయలు కూడా ఇవ్వట్లేదని.. డ్రాక్రా రుణాలు కూడా ఇవ్వలేదని జగన్ అన్నారు. హామీలు ఎక్కడ అడుగుతారో అని వైసీపీ వారి మీద దాడులు చేస్తున్నారని అన్నారు. హత్యా రాజకీయాలు కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఎల్లకాలం అధికారంలో మీరు మాత్రమే ఉండరని బాబుని హెచ్చరించారు జగన్.

YS Jagan : బాబు గ్రాఫ్ పడిపోతుంది.. హామీలు నెరవేర్చలేదన్న జగన్..!

Advertisement

నెక్స్ట్ టైం వైసీపీ అధికారంలోకి వస్తుంది. పార్టీ క్యాడల్ కూడా టీడీపీ మీద దాడులు చేయడం మొదలు పెడితే తాను ఆపినా ఆగదని అన్నారు. ఏపీలొ లా అండ్ ఆర్డర్ లేదని దారుణంగాలు జరుగుతున్నాయని.. ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. ఐతే రాష్త్ర పతి పాలన చేయాలని జగన్ కొత్త మాట మాట్లాడుతున్నారు. టీడీపీ అరాచకాలు ఎక్కువ్ అయ్యాయని ఈ విషయంపై హై కోర్ట్ అక్కడ కుదరకపోతే సుప్రీకోర్ట్ కి కూడా వెళ్తామని అన్నారు జగన్.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి