Shilpa Shirodkar | మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కారును ఢీకొట్టిన బస్సు.. తప్పిన ప్రమాదం
Shilpa Shirodkar | సూపర్ స్టార్ మహేశ్ బాబు మరదలు, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు చెందిన కారును ఢీకొట్టిన బస్సు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకోగా, శిల్పా తన సోషల్ మీడియాలో వేదికగా తీవ్ర అసంతృప్తిని వెల్లడించారు. శిల్పా శిరోద్కర్ కారును ‘సిటీ ఫ్లో’ అనే బస్సు రవాణా సంస్థకు చెందిన బస్సు ఢీకొట్టింది.
తీవ్ర అసహనం..
#image_title
ఈ సంఘటనపై ఆమె కంపెనీ ప్రతినిధులైన యోగేష్ కదమ్ మరియు విలాస్ మంకోటేలను సంప్రదించగా, వారు ఇది డ్రైవర్ తప్పిదమే, సంస్థకు సంబంధం లేదని చెప్పడంతో శిల్పా ఆగ్రహంతో విరుచుకుపడ్డారు.ఒక డ్రైవర్ నెలకు ఎంత సంపాదిస్తాడు? అతడు ఈ డ్యామేజ్‌ను ఎలా భరిస్తాడు? కంపెనీ బాధ్యత తీసుకోవాల్సినప్పుడు గుండా తప్పించుకుంటుందేంటి?”అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు శిల్పా.
“దేవుడి దయ వల్ల నా సిబ్బందికి ఏం కాలేదు. ఇందుకు ముంబై పోలీస్‌లు వెంటనే స్పందించి సహకరించారు. వారికి ధన్యవాదాలు. కానీ సంస్థ మాత్రం పూర్తిగా బాధ్యతను నెత్తిన వేసుకోవడంలో విఫలమైంది,”అంటూ శిల్పా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.