Sidhu Moose Wala : చచ్చిపోయాక కూడా కోట్లలో సంపాదిస్తున్నాడు..!!
Sidhu Moose Wala : గతేడాది మే 29న పాపులర్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దుండగుల చేతుల్లో దారుణంగా చంపబడ్డాడు. అయితే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన పాటలు బాగా పాపులర్ అవుతున్నాయి. అయితే తాజాగా ఏప్రిల్ 7న సిద్దు కొత్త పాట విడుదలైంది యూట్యూబ్ లో విడుదలైన ఈ పాట ఐదు గంటల్లోనే ఐదున్నర మిలియన్ల పైగా వ్యూస్ పొందింది. 29 ఏళ్ల వయసులోనే సిద్దు మరణించినప్పటికీ ఆయన తన ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా యూట్యూబ్ డీల్ రాయల్టీల ద్వారా కోట్లు సంపాదించగలిగాడు. ఇక ఆయన ఆస్తులు అన్నింటిని తమ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారు.
సిద్దు చనిపోయే నాటికి ఆస్తుల విలువ దాదాపుగా 100 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధూ మూసేవాలా లైవ్ షో, కచేరి లాంటి వాటికి దాదాపుగా 20 లక్షలు, పబ్లిక్ షోకు రెండు లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. చిన్న వయసులోనే గాయకుడిగా ప్రసిద్ధి చెందిన మూసేవాలా ఆయన చనిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ సంపాదిస్తుంది. యూట్యూబ్లో ఒక వీడియో లేదా ఒక పాటకు మిలియన్ లలో వ్యూస్ వస్తే యూట్యూబ్ దానికి వెయ్యి డాలర్లు ఇస్తుంది.
రీసెంట్ గా రిలీజ్ అయిన సిద్దు కొత్త సాంగ్ 18 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. దీంతో యూట్యూబ్ ఈ పాటకు 14.3 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా సిద్దు వింక్, స్పాటి పై లాంటి ప్లాట్ ఫామ్ ల నుండి రాయల్టీ మరియు అడ్వటైజ్మెంట్ డీల్స్ ద్వారా చనిపోయిన తర్వాత కూడా తన పాటల ద్వారా రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ఇక తాజాగా విడుదలైన వీడియోలో సిద్దు గాత్రానికి నైజీరియన్ గాయకుడు రాప్ ను అందించారు. ఈ వీడియోలో టెక్నాలజీ సహాయంతో సింగర్ సిద్దు మూసేవాలా కనిపించేటట్లుగా చేశారు.